MMTS Trains In Hyderabad: సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్ నగరవాసులకు ఎంఎంటీఎస్ కీలక అప్ డేట్ అందించింది. రైల్వే ట్రాక్ మెయింటనెన్స్ చేస్తున్న కారణంగా రెండు రోజులపాటు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు పలు ప్రాంతాల్లో రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. జనవరి 15,16 తేదీల్లో పలు మార్గాల్లో లింగంపల్లి-నాంపల్లి రూట్‌లో9 సర్వీసులు, నాంపల్లి-లింగంపల్లి మార్గంలో 9, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 8 సర్వీసులు, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు 8, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో ఒక్క ఎంఎంటీఎస్ సర్వీసును రద్దు చేసినట్లు వెల్లడించారు.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 10 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 22వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. జనవరి 16న విశాఖపట్నం-కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్- లింగంపల్లి, 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ -విశాఖ స్పెషల్ ట్రైన్ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ- నర్సాపూర్ ట్రైన్ మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది.
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
ఈనెల 16న కాకినాడటౌన్-సికింద్రాబాద్ (నంబర్ 82727) సువిధ స్పెషల్, 18న కాకినాడటౌన్-సికింద్రాబాద్(07537), వన్ వే 16, 18 తేదీల్లో నర్సాపూర్-వికారాబాద్ (07496), 16న అనకాపల్లి-సికింద్రాబాద్ (07436 నంబర్ జన్‌సాధారణ్ స్పెషల్) .. 17, 19 తేదీల్లో మచిలీపట్నం-సికింద్రాబాద్ (07298), ఈ 17న నర్సాపూర్-వికారాబాద్ (07089 నంబర్ జన్‌సాధారణ్ స్పెషల్), జనవరి 17న తిరుపతి-సికింద్రాబాద్(07437 జన్‌సాధారణ్ స్పెషల్); కాకినాడటౌన్-సికింద్రాబాద్(నంబర్ 07539) స్పెషల్ రైలు సర్వీసులను నడుపుతున్నట్లు సీపీఆర్ఓ రాకేష్ వెల్లడించారు.
Also Read: Gold Silver Price Today: మళ్లీ భగ్గుమన్న బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే..
Also Read: Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టం