Breaking News Live: కర్నూలులో ప్రదీప్‌ కుమార్‌రెడ్డి కుమారుడి వివాహానికి సీఎం జగన్ హాజరు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 16 Apr 2022 03:11 PM
Nizamabad BJP Leaders: నిజామాబాద్ బీజేపీ నేతల మధ్య బైట పడ్డ వర్గ పోరు

Nizamabad BJP Leaders: నిజామాబాద్ నగరంలో బీజేపీ నాయకుల మధ్య బైట పడ్డ వర్గ పోరు


నిజామాబాద్ బిజెపి పొలిటికల్ సర్కిల్ లో మరోసారి ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. నేతల మధ్య వర్గ పోరు బహిష్కృతమైంది. ఇద్దరు సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు నెట్టుకోవటం చర్చనీయాంశమైంది. అయితే గతం నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. జిల్లా బీజేపీలో ఎండల లక్ష్మీనారాయణ , ఎంపీ అరవింద్ మధ్య వర్గ పోరు నడుస్తూనే ఉంది. ఎండల వర్గం, ఎంపీ అరవింద్ వర్గానికి మధ్య మొదటి నుంచి వైరం నడుస్తూనే ఉంది. జిల్లా బీజేపీలో రెండు వర్గాలుగా చిలిపోయాయ్. ఒకటి ఎండల వర్గం, మరోటి అరవింద్ వర్గం. అయితే నిజామాబాద్ నగరంలో చేపట్టిన శోభాయాత్ర ప్రారంభానికి ఎంపీ అరవింద్ జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. అయితే అరవింద్ రావటం కాస్త లేట్ అయ్యింది. ఎంపీ కావటంతో ప్రోటోకాల్ ప్రకారం ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన ఎండల లక్ష్మీనారాయణ శోభాయాత్ర ప్రారంభించాలంటూ పట్టు పట్టారు. ఈ క్రమంలో వాగ్వాదం నడిచింది.


ఆగ్రహించిన ఎండల ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తాను కాలర్ పై చేయి పత్తి తోసేశారు. దీంతో కాస్త తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనతో మరోసారి వీరి మధ్య వైరం బహిరంగంగానే బైటపడినట్లైందని బిజెపి నేతలు చెవులు కోరుకుంటున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేసేందుకు ఇటు ఎండల, అటు ధన్ పాల్ ఆసక్తి చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో అర్బన్ టికెట్ ధన్ పాల్ కె వస్తుందని అంతా భావించారు. చివరి నిమిషంలో ఎండలకు ప్రకటించారు. ధన్ పాల్ ను పార్టీ అధిష్టానం బుజ్జగించింది. ఈ సారి టికెట్ తనకే దక్కుతుందని ధన్ పాల్ ఆశతో ఉన్నారు. అటు ఎండల లక్ష్మీనారాయణ సైతం అర్బన్ టికెట్ పై కన్నేశారు దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకీ ముదురుతోంది. ఈ ఇద్దరి నేతల అనుచరులు తమ నేతకే టికెట్ వస్తుందంటే తమ నేతకే వస్తుందని ధీమాగా ఉన్నారు. దీంతో ఇరువురి నేతల మధ్య పోరు నడుస్తూనే ఉంది.

YS Jagan In Kurnool: ప్రదీప్‌ కుమార్‌రెడ్డి కుమారుడి వివాహానికి సీఎం జగన్ హాజరు

YS Jagan In Kurnool: కర్నూలు: వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కంగాటి ప్రదీప్‌ కుమార్‌రెడ్డి కుమారుడు వంశీధర్‌రెడ్డి వివాహ కార్యక్రమానికి సీఎం వైయస్‌.జగన్‌ హాజరయ్యారు. ముందస్తు వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. వరుడు వంశీధర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.





Kamareddy Suicide Case: తల్లీకొడుకుల ఆత్మహత్య - సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఆరుగురు నిందితులు పరారీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల న్యూ మహారాజ లాడ్జిలో తల్లికొడుకులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన కామారెడ్డిలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మృతులు రామయంపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రామయంపేట కేంద్రానికి చెందిన గంగు సంతోష్, పద్మ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ మహారాజ లాడ్జిలో రూమ్ నంబర్ 203 లో ఉన్నారు. అయితే తెల్లవారుఝామున రూంలో నుంచి పొగలు రావడంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చూడగా తల్లికొడుకులు సజీవదహనమయ్యారు. అయితే తమ చావుకు ఆ ఏడుగురే కారణం అంటూ ఫోటోలు విడుదల చేసారు. దాంతో ఈ ఆత్మహత్య ఘటన సంచలనం రేపింది. మృతులు రిలీజ్ చేసిన ఫోటోలలో గతంలో రామయంపేట సిఐగా పనిచేసి బదిలీపై వెళ్లిన నాగార్జున గౌడ్ సహా పలువురు రాజకీయ నాయకుల ఫోటోలు కూడా ఉండటం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆరుగురు నిందితులు సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తదితర ప్రముఖులు

Tirumala Updates: తిరుపతి : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహా దారుడు కెవి రమణాచారి, తమిళ నటుడు కార్తీక్ రాజ్ లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ సలహాదారులు కేవీ రమణాచారి మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచంలో ఉన్న తెలుగు వారు సంతోషంగా ఉండాలని కోరుకున్న తెలిపిన ఆయన..కరోనా., ఓమిక్రాన్ వంటి మహమ్మారులు దేశంలో ఉండకుండా చేయాలనీ స్వామి వారిని ప్రార్ధించినట్లు పేర్కొన్నారు 

పెళ్లికి వెళ్తూ పోలీస్ కారునే ఢీకొట్టారు- చేవూరు వద్ద హైవే పక్కన ఘటన

హైవేపై ప్రమాదాల నివారణకు, ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సహాయం అందించేందుకు పోలీసులు మొబైల్ పెట్రోలింగ్ వాహనాలను అక్కడక్కడ నిలిపి ఉంచుతారు. పెట్రోలింగ్ వాహనాల ద్వారా ప్రమాదాలు తగ్గించాలనేది పోలీసుల ఆలోచన. అయితే ఆ పెట్రోలింగ్ వాహనాన్నే ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. పోలీస్ కారు ఈ ప్రమాదంలో తుక్కుతుక్కయింది. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కొంతమంది వ్యక్తులు తిరుపతి నుంచి ఒంగోలుకి రెండు కార్లలో బయలుదేరారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని చేవూరు వద్ద హైవే పక్కన ఆగిఉన్న పెట్రోలింగ్ వాహనాన్ని ఈ కార్లు ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Kamareddy: కామారెడ్డిలో విషాదం - సెల్ఫీ వీడియో తీసుకుని తల్లీకుమారుడు ఆత్మహత్య

Kamareddy: కామారెడ్డిలో విషాదం - సెల్ఫీ వీడియో తీసుకుని తల్లీకుమారుడు ఆత్మహత్య


కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో ఒంటికి నిప్పంటించుకుని తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి వైద్యం కోసం ఈ నెల 11న లాడ్జికి వచ్చిన్నట్టు సమాచారం. ఈ క్రమంలో రామాయంపేట్ కు చెందిన గంగం సంతోష్ (35), అతని తల్లి పద్మ  లాడ్జీలో బలవన్మరణం చెందారు. ఆత్మహత్య కు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని డిఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేష్ పరిశీలించారు.

BJP Activist Suicide: ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త చికిత్స పొందుతూ మృతి

BJP Activist Suicide In Khammam: ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త చికిత్స పొందుతూ మృతి


ఖమ్మం నగరంలోని త్రీటౌన్‌ ఏరియాలో జెండా దిమ్మె కూల్చి వేయడంపై మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. త్రీటౌన్‌ ప్రాంతానికి చెందిన సాయిగణేష్‌ ఇటీవల బీజేపీ జెండా దిమ్మె ఏర్పాటు చేశాడు. గుర్తు తెలియని వారు ఆ జెండా దిమ్మెను కూల్చివేయడంతో మనస్థాపానికి గురై త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని అక్కడే పురుగు మందు సేవించాడు. వెంటనే పోలీసులు అతనిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

YS Jagan In YSR District: నేడు రెండోరోజు వైఎస్సార్ జిల్లా పర్యటనలో సీఎం జగన్

YS Jagan In YSR District: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్, కర్నూలు జిల్లాలో రెండు రోజుల పర్యటన కొనసాగుతోంది. నిన్న గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి ఒంటిమిట్టకు వెళ్లి, శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీఎం జగన్ రాత్రి కడపలోనే బస చేశారు.


వివాహ వేడుకలకు హాజరుకానున్న సీఎం జగన్..
నేడు (శనివారం) ఉదయం అక్కడ రెండు వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఎన్‌జీఓ కాలనీలో ఐఏఎస్‌ అధికారి మౌర్య వివాహానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. అనంతరం ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుని మేయర్‌ సురేష్‌ బాబు కుమార్తె ముందస్తు వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడ నుంచి కర్నూలుకు ముఖ్యమంత్రి జగన్ పయనం కానున్నారని అధికారులు తెలిపారు. అక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి ముందస్తు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.

Background

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్, కర్నూలు జిల్లాలో రెండు రోజుల పర్యటన కొనసాగుతోంది. నిన్న గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి ఒంటిమిట్టకు వెళ్లి, శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీఎం జగన్ రాత్రి కడపలోనే బస చేశారు.


వివాహ వేడుకలకు హాజరుకానున్న సీఎం జగన్..
నేడు (శనివారం) ఉదయం అక్కడ రెండు వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఎన్‌జీఓ కాలనీలో ఐఏఎస్‌ అధికారి మౌర్య వివాహానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. అనంతరం ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుని మేయర్‌ సురేష్‌ బాబు కుమార్తె ముందస్తు వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడ నుంచి కర్నూలుకు ముఖ్యమంత్రి జగన్ పయనం కానున్నారని అధికారులు తెలిపారు. అక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి ముందస్తు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.


వరుసగా మూడో రోజు బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకిచ్చాయి. బంగారం ధర రూ.220 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,550కు చేరగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.54,060 అయింది. వరుసగా నాలుగో రోజు పెరిగిన వెండి ధర రూ.200 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.74,400 కు ఎగబాకింది.


ఏపీలో బంగారం ధర..
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.220 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 16th April 2022)  10 గ్రాముల ధర రూ.54,060 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,550కు పుంజుకుంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.74,400 అయింది. విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధర రూ.200 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,550 కు చేరింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.200 పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.74,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.  


అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా బంగాళాఖాతం నుంచి వీచే గాలులతో ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ, తమిళనాడు, యానాంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ రోజు నుంచి వర్షాలు మెళ్లమెళ్లగా పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి, హైదరాబాద్ కి ఉత్తర భాగాలు ముఖ్యంగా మేడ్చల్ కి దగ్గర ఉన్న ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. ఏపీలో మధ్యాహ్నం కొండ ప్రాంతాల్లో మొదలైయ్యే వర్షాలు సాయంకాలం సమయంలో మిగిలిన చొట్లకు విస్తరించే అవకాశాలు  కనిపిస్తున్నాయి. వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.