Vijayanand As New CS Of AP: ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ (Vijayanand) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ క్రమంలో కొత్త సీఎస్‌ను సర్కారు నియమించింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. విజయానంద్ 2022 నుంచి ఏపీ జెన్ కోకు ఛైర్మన్‌గా, 2023, ఏప్రిల్ నుంచి ఏపీ ట్రాన్స్ కోకు సీఎండీగా ఉన్నారు.
Also Read: Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ