How To Stop Fake Calls: ఈ రోజుల్లో ఫేక్ కాల్స్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. మోసగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను ట్రాప్ చేయడానికి, వారి వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. ఈ కాల్స్‌లో బ్యాంకింగ్ మోసం, నకిలీ బహుమతి, లాటరీని గెలుచుకోవడం ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. మీకు కూడా అలాంటి కాల్స్ వస్తున్నట్లయితే భయాందోళన చెందడానికి బదులు, అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. వాటిని నివారించడానికి ఏ మార్గదర్శకాలను అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలర్‌ను గుర్తించండి
తెలియని నంబర్ల నుంచ వచ్చే కాల్స్ పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. కాలర్ తాను బ్యాంక్, ప్రభుత్వ అధికారి లేదా పెద్ద కంపెనీ ప్రతినిధి అని తెలిపితే అతని సమాచారాన్ని ధృవీకరించండి.
వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకండి
మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఓటీపీ, డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా ఆధార్ నంబర్ వంటి సమాచారాన్ని ఏ కాల్‌లోనూ ఎప్పుడూ ఇవ్వకండి. ఏ విశ్వసనీయ సంస్థ ఫోన్ ద్వారా అలాంటి సమాచారాన్ని అడగదు.
ఆఫర్లు, రివార్డ్‌ల బారిన పడకండి
మీరు లాటరీని లేదా బహుమతిని గెలుచుకున్నారని నకిలీ కాల్స్‌లో పేర్కొంటున్నారు. ధృవీకరణ లేకుండా తెలియని ఆఫర్‌లను విశ్వసించవద్దు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
కాల్స్‌ను బ్లాక్ చేయండి
మీ మొబైల్‌లో అందుబాటులో ఉన్న కాల్ బ్లాకింగ్ ఫీచర్‌ని ఉపయోగించండి. ట్రూకాలర్ (Truecaller) వంటి యాప్‌ల సహాయంతో అనుమానాస్పద నంబర్‌లను గుర్తించి బ్లాక్ చేయండి.
కాల్స్‌ను రికార్డ్ చేయండి, రిపోర్ట్ చేయండి
మీరు నకిలీ కాల్ అని అనుమానించినట్లయితే దాన్ని రికార్డ్ చేయండి. కాల్‌ను 1909 (DND హెల్ప్‌లైన్) లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ (https://cybercrime.gov.in)కి రిపోర్ట్ చేయండి.
మీ మొబైల్, బ్యాంకును అలర్ట్ చేయండి
మీరు అనుకోకుండా ఏదైనా సమాచారాన్ని షేర్ చేసినట్లయితే, వెంటనే మీ బ్యాంక్, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేయండి. మీ బ్యాంక్ ఖాతాను లాక్ చేసి కొత్త పాస్‌వర్డ్‌లను సెట్ చేయండి. నకిలీ కాల్స్ ప్రమాదాల గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేయండి. సైబర్ సెక్యూరిటీ అప్‌డేట్‌లపై శ్రద్ధ వహించండి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?