Just In





Deepika Padukone : స్టార్ హీరో కూతురు కోసం తల్లిగా... రియల్ లైఫ్ మదర్ అయ్యాక దీపికా డేరింగ్ డెసిషన్... డైరెక్టర్ ఏమంటున్నాడంటే ?
Deepika Padukone : షారుఖ్, సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న యాక్షన్ చిత్రం 'కింగ్'లో దీపికా పదుకొనే తల్లి పాత్రను పోషించబోతోందనే రూమర్ బాలీవుడ్ వర్గాల్లో విన్పిస్తోంది. ఆ వార్తల్లో నిజమెంత?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు తాజాగా డేరింగ్ డెసిషన్ తీసుకుందని బాలీవుడ్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. స్టార్ కిడ్, షారూఖ్ కూతురు సుహానా ఖాన్ కు ఆమె తల్లిగా నటించబోతోంది అనేది ఆ వార్తల సారాంశం.
సుహానా ఖాన్ కు తల్లిగా ?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన కూతురు కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'కింగ్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మార్ఫ్లిక్స్ ప్రొడక్షన్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ టీంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా యాడ్ కాబోతోందనే టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో. ఈ వార్తలు గనుక నిజమైతే షారుఖ్ ఖాన్ తో దీపిక కలిసి చేస్తున్న ఆరవ సినిమా ఇది. కథాంశానికి అవసరమైన ఎక్స్‌టెండెడ్ కామియో రోల్ ను దీపికా పోషిస్తోందని, ఆమె సినిమాలో షారూఖ్ మాజీ ప్రియురాలిగా, ఈ రివేంజ్ యాక్షన్ డ్రామాలో సుహానా ఖాన్ కు తల్లిగా నటించనుంది అంటున్నారు. ఇది పూర్తి స్థాయి ప్రధాన పాత్ర కాకపోయినా, షారుఖ్ ఖాన్ - సిద్ధార్థ్ ఆనంద్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆమె ఈ ఆఫర్ ను అంగీకరించారని చెబుతున్నారు.
నిజానికి ఇందులో సైఫ్ అలీ ఖాన్, టబులను సుహానా తల్లిదండ్రులుగా ఎంచుకున్నారు. కానీ చివరికి షారూఖ్ ఆ పాత్రను పోషిస్తున్నారు. అలాగే 'కింగ్' సినిమాకు ముందుగా సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ తరువాత సిద్ధార్థ్ దర్శకుడిగా అడుగు పెట్టి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో భయంకరమైన విలన్ పాత్రను పోషిస్తున్నారు. వచ్చే నెలలో 'కింగ్' షూటింగ్ స్టార్ట్ కానుండగా, ఈ చిత్రం 2026 చివరిలో రిలీజ్ చేయనున్నారు.
ఫాల్స్ అంటూ కొట్టిపారేసిన డైరెక్టర్
సిద్ధార్థ్ ఆనంద్ - షారూఖ్ కాంబోలో వచ్చిన 2023 బ్లాక్ బస్టర్ 'పఠాన్'లో వర్క్ చేసింది దీపికా. మరోసారి ఈ కాంబో 'కింగ్'లో రిపీట్ కాబోతోంది అని వస్తున్న రూమర్లపై సిద్ధార్థ్ ఇన్ డైరెక్ట్ గా స్పందించారు. జస్ట్ 'ఫాల్స్' అనే ఒకే ఒక్క పదంతో వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
తల్లి అయ్యాక దీపికా నెక్స్ట్ ప్రాజెక్ట్
గత సంవత్సరం సెప్టెంబర్‌లో తల్లి అయిన దీపిక నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ తో రీఎంట్రీ ఇస్తుందని వార్తలు విన్పించాయి. కానీ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఆమె 'ది ఇంటర్న్' మూవీ షూటింగ్ ను ముందుగా స్టార్ట్ చేస్తుందని అంటున్నారు. పఠాన్, జవాన్ తరువాత వచ్చే ఏడాది యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందబోతున్న 'పఠాన్ 2'లో దీపికా మరోసారి షారూఖ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఆమె ఖాతాలో ఉన్న మరో రెండు సినిమాలు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న 'లవ్ అండ్ వార్', అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న 'బ్రహ్మాస్త్ర పార్ట్ 2'.