ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌కు మహారాష్ట్ర ఠాణె కోర్టులో ఊరట లభించింది. బలవంతపు వసూళ్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది.
విచారణ కోసం కోర్టు ఎదుట పరమ్‌బీర్ హాజరుకావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది. రూ. 15వేల వ్యక్తిగత బాండు సమర్పించాలని స్పష్టం చేసింది.
ఇదీ కేసు..
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సంబంధించిన బలవంతపు వసూళ్ల కేసులో ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ సహా మరికొంత మంది పోలీసులను పరారీలోని నేరస్థులుగా మెజిస్ట్రేట్ కోర్టు ఇటీవల ప్రకటించింది. చివరిసారిగా సింగ్ మే నెలలో తన కార్యాలయంలో విధులు నిర్వహించారు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
రూ.15 కోట్ల కోసం పరంబీర్ సింగ్, మరో ఐదుగురు పోలీసు అధికారులు తనను వేధించారని జులైలో మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ముంబయి పోలీసులు పరంబీర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు.
Also Read: Udhampur Express Train Fire: ఉధమ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు ఏసీ బోగీలు దగ్ధం
Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు
Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు
Read Also: నేడే రాజ్యాంగ దినోత్సవం... రాజ్యాంగ రూపకల్పనకు ఎంత ఖర్చయిందో తెలుసా?
Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి
Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి