ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే సమ్మిట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ డ్రోన్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రామ్మోహన్ నాయుడికి, సీఎం చంద్రబాబుకు అధికారులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సమ్మిట్‌కు చెందిన బ్రోచర్‌ను డ్రోన్‌తో ప్రదర్శించారు. అనంతరం సభ ప్రాంగణంలో ముగ్గురు లీడర్లు కలిసి ఫొటోలు దిగారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మొన్న చంద్రబాబు- నిన్న స్టాలిన్- ఎక్కుమంది పిల్లల్ని కనాలంటున్న సీఎంలు- అసలు కారణమేంటీ?
ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వాళ్లకే స్థానిక సంస్థల్లో టికెట్లు అని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదే క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మరో అడుగు ముందుకేసి కొత్తగా పెళ్లైన దంపతులు 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదు అని కామెంట్ చేశారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రోత్సహించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటీ? ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ప్రచారం చేయడానికి పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - తెలంగాణలో ఏం జరుగుతోంది
కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ (Congress MLC) తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు ననీవ్ కుమార్ సొంత పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. గ్రూప్ 1 (Group 1 Exams) విషయంలో పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మల్లన్న వ్యవహరించారు. సొంత ప్రభుత్వంపై తెలంగాణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి ఒక్క రోజు కాక ముందే ఆయన మరోసారి లీడర్లు,  పలువురు జర్నలిస్టులను దక్షిణ కొరియా పర్యటనకు పంపడంపై అధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి సొమ్ముతో వారిని కొరియాకు పంపారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత
జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. Congress ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురయ్యారు. ఉదయం మార్నింగ్ వాక్ చేసి తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్న సమయంలో హత్య చేశారు. ఆయన వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి కారుతో ఢీ కొట్టి విచక్షణరహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని చూసిన కొంతమంది గ్రామస్తులు వెంటనే గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అలా తరలిస్తున్న టైంలో దారిలోనే గంగారెడ్డి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
కులం సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది. ప్రభుత్వానికి వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు లేకపోతే మరో రకమైన చార్జీలు చెల్లించాలంటే ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన పనిలేదు. చక్కగా వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు. ఓ రకంగా సగానికిపైగా ప్రభత్వ సేవల్ని వాట్సాప్ ద్వారా పొందే ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేయబోతోంది. ఇందుకోసం.. మెటాతో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పందం చేసుకంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి