Tinmar Mallanna once again criticized the government of his own party :  కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు ననీవ్ కుమార్ సొంత పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. గ్రూప్ 1 విషయంలో పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించారు. సొంత ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి ఒక్క రోజు కాక ముందే ఆయన మరోసారి లీడర్లు,  పలువురు జర్నలిస్టులను దక్షిణ కొరియా పర్యటనకు పంపడంపై అధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి సొమ్ముతో వారిని కొరియాకు పంపారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


కొరియాను అడిగితే ఓ వీడియో పంపేదిగా !             
 
 మంత్రులు, జర్నలిస్టులు, అధఇకారులు సియోల్ లో పర్యటించి ఏం చేస్తారని, ఇదంతా ప్రజల సొమ్మును వృథా చేయడమేనంటూ  ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ మండిపడ్డారు. కొరియా ప్రభుత్వాన్ని అడిగితే వారే ఓ వీడియో తీసి పంపేవారని స్పష్టం చేశారు.  మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అమలులో భాగంగా సియోల్ లోని చంగ్ ఏ చంగ్ నది సుందరీకరణ జరిగిన తీరును అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులు, జర్నలిస్టులతో కూడిన బృందం కొరియా పర్యటనకు వెళ్లింది.   ఈ బృందంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా అధికారులు, పలువురు జర్నలిస్టులు  ప్రస్తుతం సియోల్ పర్యటనలో ఉన్నారు. 


గ్రూప్ 1 రాజకీయం సద్దుమణిగినట్లే - ఎవరికి నష్టం ? ఎవరికి లాభం?


అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి విమర్శలు               


కాగా చంగ్ ఏ చంగ్ నది అధ్యయనం కోసం కొరియాకు ప్రభుత్వం ప్రత్యేకంగా బృందాన్ని పంపించడాన్ని స్వతహాగా జర్నలిస్టు కూడా అయిన.. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న తప్పు బట్టడం రాజకీయ వర్గాల్లో  హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం  ఇదే అంశంపై బీఆరెఎస్ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కాంగ్రెస్ మద్దతుతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికిని మల్లన్న తరుచూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు.  అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటం వెనుక కారణలేమిటన్నది ఆ పార్టీలోనూ గుసగుసలకు కారణం అవుతోంది.


బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న రేవంత్ రెడ్డి - అన్ని లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు


 సీఎం రేవంత్ పై అసంతృప్తితో ఉన్నారా                    


సీఎం రేవంత్ రెడ్డి తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఆయన ఉన్నారని చెబుతున్నారు. అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని అందుకే ఆయన కోపం పెంచుకున్నారని అంటున్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కు రాక ముందు బీజేపీలో చేరారు. అంతకు ముందు సొంత పార్టీ పెట్టుకోవాలని ఆలోచించారు. బీజేపీలోనూ ఆయన సంతృప్తిగ ఉండలేదు. ఇక ముందు కూడా ఆయన కాంగ్రెస్ ఇమడ లేరని.. సొంత రాజకీయాలు చేసుకుంటారన్న వాదన వినిపిస్తోంది.