AP government will start WhatsApp governance : కులం సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది. ప్రభుత్వానికి వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు లేకపోతే మరో రకమైన చార్జీలు చెల్లించాలంటే ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన పనిలేదు. చక్కగా వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు. ఓ రకంగా సగానికిపైగా ప్రభత్వ సేవల్ని వాట్సాప్ ద్వారా పొందే ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేయబోతోంది. ఇందుకోసం.. మెటాతో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పందం చేసుకంది. నారా లోకేష్ పాదయాత్రలో అనేక మంది నుంచి వచ్చిన ప్రధానమైన కంప్లైంట్ ధృవపత్రాలు తీసుకోవడం సమస్యగా మారుతోందనే. దీన్ని పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.
లోకేష్ పదవిచేపట్టిన తర్వాత స్మార్ట్ గవర్నెన్స్ లో భాగంగా ప్రజలకు తక్షణ సేవల అందించాలంటే ఏం చేయాలన్నదానిపై పరిశీలన చేశారు. అనేక సంస్థలు వాట్సాప్ చాట్ బోట్ల ద్వారా అందిస్తున్న సేవల ను మరింత విస్తరించి ప్రభుుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చవచ్చన్న ఆలోచన చేశారు. ఆ మేరక లోకేష్ టీం ఈ అంశంపై పూర్తి స్థాయి పరిశీలన జరిపి మెటాను సంప్రదించింది. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా వంటి వరల్డ్ లీడింగ్ సోషల్ మీడియా సంస్థలను కలిగి ఉన్న మెటా ప్రభుత్వం కోసం ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.
వాట్సప్ లో ఒక టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికి, మనిషికి అవసరమైన సమస్త వస్తువులు వస్తున్నప్పుడు, సేవలు అందుతున్నప్పుడు.. ఒక సర్టిఫికెట్ కోసం ఆఫీసులు చుట్టూ పనులు మానుకుని మరీ తిరగాల్సిన అవసరం ఉండకూడదనేది లోకేష్ ఆలోచన. మెటాతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా పారదర్శక పౌరసేవలు మరింత సులభం అవుతాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రజుల అలాంటి సేవలు పొందడానికి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. మెటా సేవల వల్ల నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల జారీ చేస్తారు. మెటా నుంచి కన్సల్టేషన్ టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్ అమలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ అందనున్నాయి.
పాదయాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా చూసి.. మొబైల్‌లోనే ఆయా సర్టిఫికెట్లు అందిస్తాం అని హామీ ఇచ్చాను. మాట ఇచ్చినట్టే నేడు మెటాతో ఒప్పందం ద్వారా వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు, పౌరసేవలు పొందేలా మెటాతో ఒప్పందం చేసుకున్నామని లోకేష్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పారదర్శకంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.