కుడి కాలుకి దెబ్బ తగిలితే ఎడమకాలికి ఆపరేషన్ చేసిన వాళ్లను చూశాం..! జబ్బు ఒకటి అయితే మందు మరొకటి ఇచ్చే డాక్టర్లను చూశాం..! కానీ కిడ్నీలో రాళ్లను తీయని అడిగితే ఏకంగా కిడ్నీనే తీసేసే డాక్టర్లను కూడా ఇప్పుడు చూస్తున్నాం..! ఈ డాక్టర్ గుజరాత్‌లో సాక్షాత్కరించారు. ఆయన దెబ్బకు పేషంట్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. చివరికి ఆ డాక్టర్ వైద్యానికి ఆస్పత్రి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
Also Read : జొమాటోకు తమిళ సెగ.. గంటల్లోనే #Reject_Zomato ట్రెండ్
గుజరాత్‌లోని ఖేడా అనే జిల్లాకు చెందిన దేవంద్రభాయ్ రావల్‌కు విపరీతంగా నడుం నొప్పి వచ్చింది. యూరిన్ పాస్ చేయడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సమస్య ఏమిటా అని కే.ఎం.జి జనరల్ హాస్పిటల్‌లో చెక్ చేయించుకున్నాడు. అక్కడి డాక్టర్ శివుభాయ్ పటేల్ దేవంద్రభాయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి కిడ్నీలో రాయి ఉందని తేల్చారు. 14 ఎం.ఎం స్టోన్ ఉందని.. దాన్ని తీసేయాలన్నారు. బాధ ఎక్కువైపోవడంతో కుటుంబసభ్యుల అంగీకారంతో ఓ రోజు ఆపరేషన్ చేయించుకున్నారు.
Also Read : ఇంజినీరింగ్ విద్యార్థులూ రెడీనా? ఆధార్ హ్యాకథాన్‌లో ప్రోత్సాహకర బహుమతులు
కిడ్నీలో రాయి తీయించుకుంటే ఓ పెద్ద సమస్య పరిష్కారం అవుతుందని భావించిన దేవంద్రభాయ్ కుటుంబం ఆపరేషన్ రోజు అందరూ ఆస్పత్రికి వచ్చారు. అందరూ ఆపరేషన్ ధియేటర్ ముందు ఊపిరి బిగపట్టి చూస్తూ ఉన్నారు. సినిమాల్లోగానే ఆపరేషన్ చేసి డాక్టర్ బయటకు వచ్చాడు. కానీ ఆయన చెప్పిన మాట విని.. దేవేంద్రభాయ్ కుటుంబసభ్యులంతా కుప్పకూలిపోయారు. తాపీగా ఆపరేషన్ ధియేటర్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్.. "ఆపరేషన్ సక్సెస్ - కిడ్నీ రిమూవ్డ్" అని షేక్ హ్యాండిచ్చాడు. ఆ మాట విని ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. కానీ నిజం తెలిసే సరికి కుప్పకూలిపోయారు. రాళ్లు తీయడానికి ఆపరేషన్ చేసిన డాక్టర్ మొత్తం కిడ్నీనే తీసేశాడు.
Also Read: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్బీఐ షాక్.. ఎస్‌బీఐకి భారీ జరిమానా.. ఎందుకంటే..!
దీనిపై దేవంద్రభాయ్ కుటుంబసభ్యులు ఆందోళన చేయడంతో అది పేషంట్ ఆరోగ్యం కోసమే అలా చేశామని కవర్ చేసుకున్నారు. కానీ ఆ కిడ్నీ తీసేయడంతో దేవంద్రభాయ్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించింది. ఆపరేషన్ చేసిన ఎనిమిది నెలల్లోనే ఆయన చనిపోయారు. దీంతో ఆ ఆస్పత్రిపై దేవేంద్రభాయ్ కుటుంబసభ్యులు వినియోగదారుల కోర్టులో కేసు వేశారు. విచారణ జరిపి నకోర్టు ఆస్పత్రి యాజమాన్యంతో పాటు వైద్యుడు, సిబ్బంది తప్పిదం వల్లే దేవంద్రభాయ్ చనిపోయాడని నిర్ధారించి... రూ. పదకొండు లక్షల 20వేల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కానీ నిర్లక్ష్యం వల్ల పోయిన ప్రాణం తిరిగి రాదుగా..? ఇలాంటి తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా ఉండాలని.. మరికొంత మంది ఆస్పత్రి బారిన పడకుండా ఉండాలని దేవంద్రభాయ్ కుటుంబసభ్యులు న్యాయపోరాటం చేశారు.
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!