ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో అనుకోని వివాదంలో చిక్కుకొంది. ఆ కంపెనీ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ చేసిన సందేశంతో ట్విటర్లో '#Reject_Zomato' నినాదం ట్రెండ్ అవుతోంది. భాషా పరమైన మనోభావాలకు సంబంధించిన వివాదం కావడంతో జొమాటో వెంటనే స్పందించింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇంతకీ.. ఏం జరిగిందంటే?
Also Read: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్బీఐ షాక్.. ఎస్‌బీఐకి భారీ జరిమానా.. ఎందుకంటే..!
వికాస్ అనే వ్యక్తి జొమాటోలో కొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్ చేశాడు. పార్సిల్ తెరిచిచూస్తే ఒక ఐటెమ్ మిస్సైనట్టు కనిపించింది. వెంటనే కస్టమర్‌కేర్‌కు సందేశం పంపించాడు. డబ్బులను రీఫండ్ చేయాలని కోరాడు. కస్టమర్ ఎగ్జిక్యూటివ్ రెస్టారెంట్‌కు ఐదుసార్లు కాల్ చేసేందుకు ప్రయత్నించానని, భాషా పరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. తనకు దాంతో సంబంధం లేదని, తమిళనాడులో జొమాటో ఉన్నప్పుడు తమిళ భాషను తెలిసిన వారికి ఉద్యోగులను తీసుకోవాలని, భాషా తెలిసిన వాళ్లకు చెప్పి రీఫండ్ ఇప్పించాలని వికాస్ అన్నాడు. దాంతో 'హిందీ జాతీయ భాష. అందరూ ఎంతోకొంత హిందీ తెలుసుకోవాలి' అని కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు.
Also Read: Retirement Planning: రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఈ ఐదు పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే నష్టపోతారు!
ఆ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ హిందీ భాష నేర్చుకోవాలని, జాతీయ భాష అని చెప్పడంతో వికాస్ జొమాటకు ట్వీట్ చేశాడు. వారి వద్ద ఎవరూ ఆర్డర్ చేయొద్దని, యాప్‌ను వెంటనే తమ ఫోన్ల నుంచి తొలగించాలని ప్రజలను కోరాడు. వెంటనే రిజెక్ట్ జొమాటో అంటూ గంటల్లోనే 18వేల ట్వీట్లు వెల్లువెత్తాయి. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన జొమాటో వెంటనే వికాస్‌ను సంప్రదించింది. అతడు డబ్బులను రీఫండ్ చేయడమే కాకుండా జొమాటో క్షమాపణలు చెప్పాలని కోరాడు.
Also Read: ప్రత్యర్థులకు టాటా ‘పంచ్’.. తక్కువ ధరలో కారు కొనాలనేవారికి కరెక్ట్ ఛాయిస్!
'వికాస్ ఇలా జరగడం అంగీకారం కాదు. ఇలా జరగకూడదు. మేం వెంటనే ఏం జరిగిందో తెలుసుకుంటాం. ప్రైవేటు మెసేజ్ ద్వారా మీ రిజిస్టర్డ్ నంబర్ ఇవ్వగలరా?' అని జొమాటో కోరింది. ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినప్పటికీ ట్విటర్లో మాత్రం ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది.
వివాదం కాస్త సద్దుమణిగాక జొమాటో తమిళ వెర్షన్ సిద్ధం చేస్తున్నామని ఆ కంపెనీ వెల్లడించింది. లోకల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనిరుద్ రవిచందర్‌ను నియమించాలని పేర్కొంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి