దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. మోసాల వర్గీకరణ మరియు వాణిజ్య బ్యాంకుల రిపోర్టింగ్ 2016కు సంబంధించిన కొన్ని ఆదేశాలను పాటించనందుకుగానూ భారతీయ స్టేట్ బ్యాంకు (SBI)కు సోమవారం ఆర్బీఐ రూ.1 కోటి రూపాయల భారీ జరిమానా విధించింది.  








బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 46 (4) (i)మరియు 51 (1) సెక్షన్ 47A (1)(c) నిబంధనల ప్రకారం తమకు ఉన్న అధికారాలతో ఈ జరిమానా నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంది. రెగ్యులేటరీ కాంప్లయన్స్‌లోని లోపాల ఆధారంగా మరియు బ్యాంక్ తన ఖాతాదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటును బహిర్గతం చేయకూడదు. కానీ ఎస్‌బీఐ ఈ రూల్స్ అతిక్రమించిందన్న కారణంగా జరిమానా విధించారు.


Also Read: రెండు తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, కచ్చితమైన విశ్లేషణల కోసం


కస్టమర్ బ్యాంక్ అకౌంట్ పరిశీలన మరియు అందుకు సంబంధించి తుది నివేదికను పరిశీలించడం జరుగుతుంది. అందుకు సంబంధించిన చట్టాలలో పేర్కొన్న ఆదేశాలకు అనుగుణంగా ఎస్‌బీఐలో వివరాలు లేకపోవడం, నివేదించడంలో జాప్యం జరగడాన్ని ఆర్‌బీఐ రూల్స్ ఉల్లంఘన కిందకి వస్తుంది. జరిమానా విధించిన ఆర్బీఐ.. తాము ఎందుకు పెనాల్టీ విధించకూడదో కారణాన్ని చూపించమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసు జారీ చేసింది.


Also Read: దివ్యాంగ విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50 వేలు సాయం.. 


వ్యక్తిగతంగా బ్యాంకు ఇచ్చిన వివరణ, మౌఖిక వివరణను పరిశీలించిన అనంతరం రిజర్వ్ బ్యాంక్ పైన పేర్కొన్న ఆదేశాలను ఎస్‌బీఐ బ్యాంకు పాటించలేదని రుజువైంది. దాంతో నగదు రూపంలో జరిమానా విధించే అవకాశం ఉందని నిర్ధారిస్తూ కోటి రూపాయల భారీ జరిమానా విధిస్తూ ఆర్బీఐ నోటీసు జారీ చేసింది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి