యువ ఇంజినీర్లు, ఇన్నోవేటర్లకు శుభవార్త! ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ఆధార్ హ్యాకథాన్ 2021' త్వరలో ఆరంభం కానుంది. అక్టోబర్ 28 నుంచి 31 వరకు రెండు థీముల్లో ఈ హ్యాకథాన్ నిర్వహించనున్నారు. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎదురు చూస్తున్న టెక్ విద్యార్థులే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
'అక్టోబర్ 28 అర్ధరాత్రి నుంచి 31 వరకు హ్యాకథాన్ కొనసాగుతుంది' అని ఉడాయ్ తెలిపింది. ఈ హ్యాకథాన్ రెండు థీముల్లో జరుగుతోంది. మొదటిది 'ఎన్‌రోల్ మెంట్ అండ్ అప్‌డేట్'. ప్రస్తుతం చిరునామాలు నమోదు చేసుకొనేటప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇందులో పరిష్కారాలు వెతకాలి.
రెండోదైన 'ఐడెంటిఫై అండ్ అథెంటికేషన్'లో ఆధార్ నంబర్ లేకుండా గుర్తింపును రుజువు చేసుకోవడం వంటి సమస్యలను పరిష్కరించాలి. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు ఫేస్ అథెంటికేషన్ ఏపీఐకి సంబంధించిన యాప్‌లను రూపొందించడమూ హ్యాకథాన్‌లో లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రత్యేకించి ఇంజినీరింగ్ విద్యార్థులను ఉడాయ్ ప్రోత్సహిస్తోంది. రెండు థీముల్లో గెలిచిన వారికి ప్రత్యేకంగా నగదు బహుమతులు, ఇతర ప్రయోజనాలూ అందించనున్నారు. పోటీదారులు బృందాలుగా పాల్గొనాలి. ఆధార్ టీమ్ నిర్వహిస్తున్న తొలి హ్యాకథాన్ ఇదే. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం https://hackathon.uidai.gov.inకు లాగిన్ అవ్వాలి.
Also Read: Retirement Planning: రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఈ ఐదు పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే నష్టపోతారు!
Also Read: ప్రత్యర్థులకు టాటా ‘పంచ్’.. తక్కువ ధరలో కారు కొనాలనేవారికి కరెక్ట్ ఛాయిస్!
Also Read: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్బీఐ షాక్.. ఎస్‌బీఐకి భారీ జరిమానా.. ఎందుకంటే..!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!