Chennai Flood Alert: జలదిగ్బంధంలో చెన్నై.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు

భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు సీఎం స్టాలిన్.

Continues below advertisement

తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాల కారణంగా పాఠాశాలలు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు సీఎం స్టాలిన్. చెన్నై, కాంచీపురం, తిరువల్లుర్‌, చెంగల్‌పట్టు జిల్లాల్లో రాబోయే రెండు రోజులు సెలవు ఇస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. ప్రస్తుతం చెన్నై సహా చుట్టుపక్కల జిల్లాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో దూరం ప్రాంతాల నుంచి చెన్నై వచ్చేవారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని స్టాలిన్ కోరారు. 

Continues below advertisement

వర్షాల కారణంగా చెన్నై, ఎగ్మోర్, కోలతూర్ ప్రాంతాల్లో పరిస్థితిని స్టాలిన్ పరిశీలించారు. సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూశారు. వరద నీటిలో దిగి మరి బాధితులను పరామర్శించారు. వరద సహాయాన్ని అందించారు.

చెన్నైలోని పలు ప్రాంతాల్లో వరద ప్రవాహం ఉంది. విల్లివక్కం, కోలతూర్‌లోని పలు ప్రాంతాల్లో నేను పర్యటించాను. తక్షణ సహాయ చర్యలకు ఆదేశించాను. ప్రస్తుతం పైప్‌ల సాయంతో నీటిని తోడుతున్నారు. పాఠశాలలనే పునరావాస కేంద్రాలుగా ఉపయోగిస్తున్నాం. మొత్తం 160 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అందులో 44 ఇప్పటికే నడుస్తున్నాయి. 

ప్రజా ఆరోగ్యం, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని రానున్న రెండు రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాం. 

సహాయక చర్యలకు ఎన్‌డీఆర్ఎఫ్, పోలీసులు సహా అగ్నిమాపక సిబ్బందిని ప్రభుత్వం ఉపయోగిస్తోంది. చెంగల్‌పట్టు, మధురైకు కూడా సహాయక బృందాలను పంపారు.

Also Read: Nadda on BJP: ఇక భాజపా కథ వేరుంటది.. బంగాల్‌ రాజకీయంపై నడ్డా కీలక వ్యాఖ్యలు

Also Read: Aryan Khan Drugs Case: 'ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేశారు.. షారుక్ ఇప్పటికైనా నోరు విప్పు'

Also Read: Chennai Rain: భారీ వర్షాలకు చెన్నై గజగజ.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎమ్‌డీ

Also Read: Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!

Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే

Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే

Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం

Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola