దిల్లీలో భాజపా జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, పలువురు అగ్రనేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల జరిగిన బంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఉపఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ భేటీలో విశ్లేషించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్జా బంగాల్ రాజకీయంపై ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగాల్‌లో ఇక భాజపా రాజకీయం వేరుగా ఉంటుందన్నారు.
ఇటీవల జరిగిన బంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో భాజపా వైఫల్యంపై స్వప్నన్ దాస్ గుప్తా, అనుపమ్ హజ్రా, కైలాశ్ విజయవర్గీయతో జేపీ నడ్డా చర్చించారు. పార్టీలో కీలక నేతలు తృణమూల్ కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై కూడా చర్చించినట్లు సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా నేతలు చర్చించనున్నారు.
మోదీకి సత్కారం..
భారత్ 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును చేరుకున్నందుకు గాను ప్రధాని మోదీకి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు సన్మానం చేశారు.
Also Read: Aryan Khan Drugs Case: 'ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేశారు.. షారుక్ ఇప్పటికైనా నోరు విప్పు'
Also Read: Chennai Rain: భారీ వర్షాలకు చెన్నై గజగజ.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎమ్‌డీ
Also Read: Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి