ఇటీవల చనిపోయిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం ఆమె దశదిన కర్మ. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరులోని మంత్రి వ్యవసాయ క్షేత్రంలో క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. మహబూబ్‌ నగర్ జిల్లా భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి సీఎం కేసీఆర్ చేరుకొని ఆమె సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని తదితరులు ఉన్నారు. 


Also Read: రూ.100కి చిల్లర ఇవ్వడం మర్చిపోయిన కండక్టర్.. ఒక్క ట్వీట్‌తో ప్రయాణికుడి జేబులోకి డబ్బులు


మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి శాంతమ్మ అక్టోబర్‌ 29న హైదరాబాద్‌లో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్స్‌లో ఉంటున్న ఆమెకు గత నెల 29న రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.


‘‘మా తల్లి కీ.శే. విరసనోళ్ళ శాంతమ్మ దశదినకర్మకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరవడం జరిగింది.’’ అని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ట్వీట్ చేశారు.


Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు ఇలా..


















Also Read: Sadar Utsav: మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడిపై కేసు.. కారణం ఏంటంటే..


Also Read: బస్సు టికెట్ ధరలు పెంచే ఛాన్స్.. సజ్జనార్ వెల్లడి, సాధారణ వ్యక్తిలా డీలక్స్ బస్సులో నల్గొండకు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి