తెలంగాణలో ఓ మంత్రి కుమారుడిపై కేసు నమోదైంది. సినిమాటోగ్రఫీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై పోలీసులు కేసు పెట్టారు. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ ఖైరతాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన సదర్ ఉత్సవాలకు వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మంత్రి తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ తన కారులో వస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే గేటు సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు రాగానే ఆయన కారు ఓ వ్యక్తి పాదం మీదుగా వెళ్లింది. నడుచుకుంటూ వెళ్లున్న ఇందిరానగర్‌కు సంతోష్ అనే 32 ఏళ్ల వ్యక్తి ఎడమ పాదం పైనుంచి మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న కారు టైరు వెళ్లింది. ఈ ఘటనలో సంతోష్ స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను వెంటనే కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.
చికిత్స అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు.. కారు నడుపుతున్న తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని సైఫాబాద్ పోలీసులు వెల్లడించారు. అయితే, నిన్న (నవంబరు 6)న జరిగిన సదర్ ఉత్సవంలో బాధితుడి కాలుపైకి సాయి కిరణ్ ఇన్నోవా కారు ఎక్కగానే స్థానికులు ఆందోళన చేపట్టారు. తలసాని సాయి వాహనాన్ని ముందుకు వెళ్లకుండా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందడడంతో వాహనం దిగి వచ్చిన సాయి కిరణ్ హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తానని హామీ ఇవ్వడంతో స్థానికులు అప్పుడు శాంతించారు.
Also Read: బస్సు టికెట్ ధరలు పెంచే ఛాన్స్.. సజ్జనార్ వెల్లడి, సాధారణ వ్యక్తిలా డీలక్స్ బస్సులో నల్గొండకు..
ఇదిలా ఉంటే సాయి కిరణ్ యాదవ్ కూడా టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో సాయి కిరణ్ యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేశారు. కానీ, అప్పటి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిపై ఓటమి చెందారు.
ఏటా దీపావళి తర్వాత సదర్
ఏటా దీపావళి తర్వాత ప్రతి సంవత్సరం సదర్‌ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి సదర్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సదర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వమే నిర్వహిస్తూ వస్తుంది. ఏటా ఈ సదర్ ఉత్సవాలను మంత్రి తలసాని శ్రీనివాస్ పర్యవేక్షిస్తుంటారు.
Also Read: రూ.100కి చిల్లర ఇవ్వడం మర్చిపోయిన కండక్టర్.. ఒక్క ట్వీట్‌తో ప్రయాణికుడి జేబులోకి డబ్బులు
Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు ఇలా..
Also Read: iPhone New Feature: చిత్రలహరిలో సాయితేజ్ తయారు చేసిన ఫీచర్.. త్వరలో వచ్చే కొత్త ఐఫోన్‌లో?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి