మీరు చిత్రలహరి సినిమా చూశారా? ఆ సినిమాలో యాక్సిడెంట్ అవ్వగానే ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ వెళ్లేలా చేసే డివైస్‌ను హీరో సాయితేజ్ తయారు చేస్తాడు. ఇప్పుడు కొత్త ఐఫోన్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


కార్ యాక్సిడెంట్‌ను గుర్తించి ఎమర్జెన్సీ నంబర్‌కు వెంటనే కాల్ చేసే ఫీచర్‌తో కొత్త ఐఫోన్, యాపిల్ వాచ్‌ను కంపెనీ రూపొందిస్తుందని వార్తలు వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. వచ్చే సంవత్సరం లాంచ్ కానున్న ఐఫోన్లు, యాపిల్ వాచ్‌ల్లో ఈ ఫీచర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. 


పిక్సెల్ ఫోన్లలో ఉండే గూగుల్ పర్సనల్ సేఫ్టీ యాప్ ద్వారా కార్ యాక్సిడెంట్ వంటి రోడ్డు ప్రమాదాలను గుర్తించి వెంటనే సాయం కోసం కాల్ చేసే ఫీచర్‌ను అందించారు. ప్రస్తుతం టాప్ ఎండ్ కార్లలో ఉన్న జీఎం ఆన్ స్టార్, స్టార్ లింక్, యూకనెక్ట్‌ల మాదిరిగానే ఇది కూడా పనిచేస్తుంది.


ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా కార్లలో కనెక్టివిటీ ఫీచర్లు అందించడం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఐఫోన్‌లో ఈ ఫీచర్‌ను అందిస్తే.. అది ఎంతోమంది డ్రైవర్లకు ఉపయోగపడుతుంది. కారులో ఉన్న ప్రయాణికుడి జేబులో లేదా డ్యాష్ బోర్డులో ఎక్కడ పెట్టినా సరే ఇది క్రాష్‌ని గుర్తించగలదు.


కారు డ్రైవ్ చేస్తూ స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం అంత మంచిది కాదు. కాబట్టి కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఇంటిగ్రేషన్ సిస్టంలను తాజాగా లాంచ్ అవుతున్న కార్లలో అందిస్తున్నారు. 2020లో లాంచ్ అయిన 80 శాతం కార్లలో ఈ ఫీచర్ ఉన్నట్లు తెలుస్తోంది.


యాపిల్ ఎప్పట్నుంచో ‘ఐరన్ హార్ట్’ అనే ప్రాజెక్టుపై పనిచేస్తుందని తెలుస్తోంది. స్మార్ట్ స్పీకర్లు, లైటింగ్‌ను హోం కిట్‌ను ఎలా కంట్రోల్ చేస్తుందో.. అదే విధంగా కారు సెట్టింగ్స్‌కు ఫోన్ కనెక్ట్ చేసే ఫీచరే ఇది. గతంలో యాపిల్ యాక్సిడెంట్ డిటెక్షన్ అనుకున్నంతగా పనిచేయలేదు. దీంతో యాపిల్ ఎన్నో సంవత్సరాలు ఐవోఎస్, వాచ్ఓఎస్ వినియోగదారుల నుంచి డేటా, అనలిటిక్స్ సేకరించాల్సి వచ్చింది. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందా.. విజయవంతం అవుతుందా అనేది చూడాల్సి ఉంది.


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!


Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?


Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి