మహబూబాబాద్ మున్సిపాలిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది. పాము కాటుకు మూడు నెలల చిన్నారి కన్నుమూసింది. చిన్నారి తల్లిదండ్రులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్  మున్సిపాలిటీ పరిధిలోని  శనిగపురంలో ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటు వేసింది. ఈ ఘటనలో మూడు నెలల చిన్నారి మృతి చెందగా పాప తల్లిందండ్రులు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శనిగపురం గ్రామానికి చెందిన క్రాంతి, మమత  దంపతులకు మూడు నెలల చిన్నారి ఉంది. పాపకి అనారోగ్యంగా ఉంటే కొన్ని రోజులుగా ఖమ్మంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స అందించారు. కాస్త తగ్గడంతో చిన్నారిని శనివారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. పాప నిద్రిస్తున్న సమయంలో నోటి నుంచి నురగ రావడంతో కంగారుపడిన తల్లిదండ్రులు మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాపకు కప్పిన దుప్పటిలో ఉన్న పాము చిన్నారి తల్లిదండ్రులను కాటు వేయడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 


Also Read: Hyderabad Crime: రాత్రి ఇంట్లో ఒంటరిగా యువకుడు.. బయటికెళ్లిన ఫ్యామిలీ, తిరిగొచ్చి చూసి షాక్


'పాపకు ఆర్యోగం బాగోలేక పోతే ఖమ్మం తీసుకెళ్లాం. నిన్న రాత్రి తిరిగి ఇంటికి తీసుకొచ్చాం. బిడ్డకు చద్దరు కప్పాము. కాసేపటికి బిడ్డ నోట్లోంచి నురగలు కక్కుతుండే. దాంతో బిడ్డను మహబూబాబాద్ హాస్పిటల్ కు తీసుకెళ్లాం. హాస్పిటల్ వద్ద పాప చద్దరులోంచి పాము బయటపడింది. పాము బిడ్డ తల్లిదండ్రులను కరిసింది. పాప తండ్రి క్రాంతి నాకు మావయ్య అవుతాడు, మాకు బంధువు. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలి.' --- విజయ్, స్థానికుడు


Also Read: పెళ్లింట వరుస విషాదాలు.. తల్లి చనిపోయిందని తెలియగానే ఏఎస్సై హఠాన్మరణం


'నా బిడ్డను పాము కరిసింది. మూడు నెలల బిడ్డ సోయలేకుండా పడిఉంది. అయ్యో బిడ్డ ఇక్కడ చనిపోయింది. తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడు. అయ్యో దేవుడా ఎంత కష్టం తెచ్చావు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మేము సామాన్యులం. ఏమి తెలవదు. మీరే దిక్కు అయ్యా.'--- అయిలమ్మ, చిన్నారి అమ్మమ్మ


Also Read: MP Gorantla Madhav సార్ వచ్చినాడు.. మీ నాన్న ఎక్కడున్నా ఫోన్ చేయరా..! కంటతడి పెట్టిస్తున్న ఘటన


Also Read: Ex-Naxalites Arrest: మావోల పేరుతో దోపిడీలు చేస్తున్న మాజీ నక్సలైట్లు... తుపాకీలతో బెదిరిస్తూ వసూళ్లు... చివరకు ఎలా చిక్కారంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి