ABP  WhatsApp

Aryan Khan Drugs Case: 'ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేశారు.. షారుక్ ఇప్పటికైనా నోరు విప్పు'

ABP Desam Updated at: 07 Nov 2021 03:47 PM (IST)
Edited By: Murali Krishna

డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

'షారుక్ ఖాన్ ఇప్పటికైనా నోరు విప్పు'

NEXT PREV

ముంబయి డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేసి రూ. 25 కోట్లు ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారని నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఈ కుట్రకు భాజపా నేత మోహిత్​ భారతీయ ప్రధాన సూత్రధారి అని వ్యాఖ్యానించారు.



ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారు. కానీ 18 కోట్లకు ఫైనల్ డీల్ కుదిరింది. అన్నీ వాళ్లు అనుకున్నట్లుగానే జరిగాయి కానీ (గోసవీ తీసుకున్న) సెల్ఫీతో గేమ్ మొత్తం మారిపోయింది. ఆ డ్రగ్స్ పార్టీకి ఆర్యన్ ఖాన్ తనంతట తాను రాలేదు. ప్రతీక్ గాబా, అర్బాజ్ మర్చంట్‌తో వచ్చాడు.                                                       - నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి


మొదటి రోజు నుంచే..


ఈ కేసును మొదట్లో దర్యాప్తు చేసిన ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే, మోహిత్ కాంబోజ్ ఇద్దరూ డబ్బు డిమాండ్ చేశారని నవాబ్ ఆరోపించారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తొలిరోజు నుంచే షారుక్ ఖాన్‌కు బెదిరింపులు మొదలయ్యాయని తెలిపారు. ఇప్పటికీ వీటి గురించి బహిరంగంగా మాట్లాడొద్దని షారుక్‌కు ఆదేశాలిస్తున్నారని నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఇప్పటికైనా షారుక్ బయటకు వచ్చి మాట్లాడాలన్నారు.


శ్మశాన వాటికలో..


సమీర్ వాంఖడే, మోహిత్ కాంబోజ్ మధ్య సాన్నిహిత్యం ఉందని నవాబ్ మాలిక్ అన్నారు. అక్టోబర్ 7న వీరిద్దరూ ఓ శ్మశానవాటిక వద్ద కలిశారన్నారు. నౌక నుంచి అదుపులోకి తీసుకున్నవారిలో ముగ్గుర్ని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. 


Also Read: Chennai Rain: భారీ వర్షాలకు చెన్నై గజగజ.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎమ్‌డీ


Also Read: Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!


Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే


Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే


Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం


Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


 

Published at: 07 Nov 2021 03:41 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.