ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ ఎప్పుడూ తన నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన ట్విటర్లో ఒక పోల్ పెట్టారు. పన్నులు చెల్లించేందుకు టెస్లా షేర్లలో పదోవంతు అమ్మేసుకోనా? అంటూ 62.5 మిలియన్ల ఫాలోవర్లను ప్రశ్నించారు. వారిచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
వచ్చే ఏడాది నేపథ్యంలో ఎక్కువ స్టాక్ ఆప్షన్లను ఎక్సర్‌సైజ్ చేస్తుండటంతో భారీ పన్ను చెల్లించాల్సి వస్తోందని గతంలోనే మస్క్ అన్నారు. 'నగదు రూపంలో నేనెక్కడి నుంచీ జీతం లేదా బోనస్ తీసుకోవడం లేదు. నా దగ్గర షేర్లు మాత్రమే ఉన్నాయని గమనించండి. వ్యక్తిగతంగా పన్నులు చెల్లించాలంటే నేను స్టాక్స్ అమ్ముకోక తప్పదు' అని ఆయన ట్వీట్ చేశారు. 'ఇంకా నగదు రూపంలోకి రాని రాబడిని పన్ను ఎగవేతగా ముద్రవేస్తున్నారు. అందుకే నేను టెస్లా స్టాక్‌లో పదిశాతం అమ్ముకొనేందుకు ప్రతిపాదిస్తున్నాను' అని మస్క్ అన్నారు.
డెమోక్రాట్లు ప్రతిపాదించిన 'బిలియనీర్ల పన్ను'ను మస్క్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు విక్రయించని ట్రేడబుల్ అసెట్స్‌పై లాంగ్‌టర్మ్ గెయిన్స్‌పై పన్ను వల్ల 700 బిలియనీర్లపై ప్రభావం పడుతుందన్నారు. ఏదేమైనా ట్విటర్ పోల్‌లో వచ్చిన ఫలితాల ప్రకారం నడుచుకుంటానని అన్నారు.
మస్క్ పెట్టిన పోల్‌కు ఏడుగంటల్లోనే 20 లక్షల మంది స్పందించారు. 55 శాతం మంది షేర్లు అమ్మకానికే ఆమోదం తెలిపారు. ఆదివారం ఈ పోల్ ముగుస్తుంది. టెస్లాలో మస్క్‌కు 170.5 మిలియన్ల షేర్లు ఉన్నాయి. అందులో పది శాతం అమ్మితే దాదాపుగా 21 బిలియన్ డాలర్లు ముడుతాయి. ప్రస్తుతం మస్క్ వద్ద 22.86 మిలియన్ షేర్ల ఆప్షన్లు ఉన్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 13న ఈ కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అవుతుంది. ఆప్షన్లపై రాబడిపై పన్ను చెల్లిస్తానని ఇంతకు ముందే అతడు చెప్పడం గమనార్హం.
Also Read: Provident Funds: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?
Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్ తెచ్చిన ఐటీ శాఖ
Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి
Also Read: Whatsapp New Feature: ఇంటర్ నెట్ అవసరం లేకుండానే వాట్సాప్ వాడుకోవచ్చు.. అద్భుతమైన నయా ఫీచర్