Andhra Pradesh News Today: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో "మెగా" అట్రాక్షన్- ప్రత్యేక అతిథిగా రానున్న చిరంజీవి - ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఉదయం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు అయ్యే గెస్ట్‌ల లిస్ట్‌ భారీగానే ఉంది. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మెగాస్టార్‌తోపాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా ప్రమాణ స్వీకరోత్సవానికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథి హోదాలో మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రత్యేక విమానంలో బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసి ఉదయం కార్యక్రమానికి హాజరవుతారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి




ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక - సీఎం అభ్యర్థిగా ప్రతిపాదన
టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandheswari), కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీయే కూటమి ఎల్పీ లీడర్‌గా చంద్రబాబు పేరును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


విద్యుత్ కొనుగోలు వివాదంపై కేసీఆర్‌కు నోటీసు- 30న విచారణకు రావాలని ఆదేశం
తెలంగాణలో విద్యుత్ కొనుగోల అంశం పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యుత్‌ కొనుగోళ్ళ అంశంపై విచారణకు ఆదేశించింది. దీని కోసం జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ వేసింది. ఇతర రాష్ట్రంలో కొనుగోలు చేసిన విద్యుత్ ఒప్పందాలపై జరిగిన లోటుపాట్లు తేల్చాలని ఆదేశించింది. దీనిపై విచారణ చేస్తున్న కమిషన్‌ మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. జూన్ 30 విచారణకు రావాలని ఆదేశించింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రుణమాఫీపై గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్- అధికారులకు టార్గెట్ ఫిక్స్
తెలంగాణలో రుణమాఫీకి చర్యలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 15 నాటి కల్లా రుణమాఫీ చేయాల్సిందేనంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీని కోసం స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వ్యవసాయ, సహకార శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... రుణమాఫీ అంశంపై ఎక్కువ చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో రుణమాపీ కీలక పాత్ర పోషించింది. అందుకే ఆ హామీ అమలుపై సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే' - అమరావతే రాజధాని అని చంద్రబాబు స్పష్టత
రాష్ట్రంలో ఐదేళ్లు విధ్వంసం పాలన సాగిందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. పదవి వచ్చిందని విర్రవీగుతూ.. అహంకారంతో పాలన సాగిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అన్నారు. 'ఓటర్లు ప్రవర్తించిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. తప్పు చేసిన వారిని క్షమిస్తే ఆ తప్పు అలవాటుగా మారుతుంది. అలాంటి వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. విధ్వంస, కక్షా రాజకీయాలకు దూరంగా ఉండాలి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి