BRS Chief KCR: తెలంగాణలో విద్యుత్ కొనుగోల అంశం పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యుత్‌ కొనుగోళ్ళ అంశంపై విచారణకు ఆదేశించింది. దీని కోసం జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ వేసింది. ఇతర రాష్ట్రంలో కొనుగోలు చేసిన విద్యుత్ ఒప్పందాలపై జరిగిన లోటుపాట్లు తేల్చాలని ఆదేశించింది. దీనిపై విచారణ చేస్తున్న కమిషన్‌ మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. జూన్ 30 విచారణకు రావాలని ఆదేశించింది. విద్యుత్ కొనుగోలు అంశంలో తన పాత్రపై వివరణ ఇవ్వాలని పేర్కొంది.