BRS Public Meeting Live Updates: దేశమంతా ఉచిత విద్యుత్, రైతు బంధు - అగ్నిపథ్ రద్దు: కేసీఆర్ కీలక హామీలు

BRS Public Meeting Live Updates: బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.

ABP Desam Last Updated: 18 Jan 2023 06:14 PM
దేశమంతా ఉచిత విద్యుత్, రైతు బంధు - అగ్నిపథ్ రద్దు: కేసీఆర్ కీలక హామీలు

కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటే... దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే రైతు బంధు పథకాన్ని కూడా దేశం మొత్తం అమలు చేస్తామన్నారు. ఖమ్మంలో నిర్వహించిన్ బీఆర్ఎస్ ఆవిర్భావసభలో కేసీఆర్ కీలక హామీలు ఇచ్చారు.  దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్ చేస్తోందని.. అమలు చేయకపోతే.. తాము వచ్చిన తరవాత అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.  మహిళలను ప్రోత్సహించిన దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. 35 శాతం రిజర్వేషన్ బీఆర్‌ఎస్ ప్రతిపాదిస్తోందని తెలిపారు.  విశాక ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతామంటున్నారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో అమ్మనీయబోమని.. ఒక వేళ అమ్మినా మళ్లీ తాము వచ్చిన తర్వాత జాతీయం చేస్తామని ప్రకటించారు. 


బీఆర్ఎస్‌ను బలపరిస్తే మంచి భవిష్యత్ 


బీఆర్ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి మంచినీళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు.  మేక్‌ ఇన్‌ ఇండియా జోక్‌ ఇన్‌ ఇండియా అయిపోయిందన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని.. సైన్యంలో వేలు పెట్టి తెలివితక్కువ విధానంతో వచ్చిన ఈ విధానాన్ని రద్దు చేస్తాం. పాత పద్దతిలోనే ఉద్యోగ నియామకాలు ఉంటాయని ప్రకటించారు.  ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వమని ఎల్ఐసీని కూడా అమ్ముతామంటున్నారని.. తాము వచ్చాక  ఎల్‌ఐసీని జాతీయం చేస్తామన్నారు.  వచ్చే ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్తే మేం అధికారంలోకి వస్తున్నామన్నారు.  ఎల్‌ఐసీ మిత్రులారా బీఆర్‌ఎస్‌ను బలపరచండని పిలుపునిచ్చారు.  విద్యుత్ డిస్కమ్‌లు అప్పనంగా షావుకార్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్‌  కార్మికులారా పిడికిలి ఎత్తి బీఆర్‌ఎస్‌ను బలపరచండీ... విద్యుత్‌ను పబ్లిక్ సెక్టార్‌లోనే ఉంచుకుందామని హామీ ఇచ్చారు. 

అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం: కేసీఆర్

దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్ చేస్తోంది. మహిళలను ప్రోత్సహించిన దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. 35 శాతం రిజర్వేషన్ బీఆర్‌ఎస్ ప్రతిపాదిస్తోంది. విశాక ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతామంటున్నారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో పోవ్వబోం. మళ్లీ జాతీయం చేస్తాం.


విపక్ష ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి మంచినీళ్లను అందిస్తాం. మేక్‌ ఇన్‌ ఇండియా జోక్‌ ఇన్‌ ఇండియా అయిపోయింది. అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం. సైన్యంలో వేలు పెట్టి తెలివితక్కువ విధానంతో వచ్చిన ఈ విధానాన్ని రద్దు చేస్తాం. పాత పద్దతిలోనే ఉద్యోగ నియామకాలు ఉంటాయి. 


 

ఎల్‌ఐసీ కోసం పోరడతాం: కేసీఆర్

ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వం. మోదీ... మీ పాలసీ ప్రైవేటైజేషన్‌... మాది నేషనలైజేషన్.. ఇవాళ ఎల్‌ఐసీ అమ్ముతా అంటున్నావ్.... అమ్మేసే... పర్వాలేదు.. మేం వస్తే ఎల్‌ఐసీని జాతీయం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్తే మేం అధికారంలోకి వస్తున్నాం. ఎల్‌ఐసీ అమ్మినా... మేం వాపస్‌ తీసుకుంటాం. ఎల్‌ఐసీ మిత్రులారా బీఆర్‌ఎస్‌ను బలపరచండీ.. మన ఎల్‌ఐసీని వెనక్కి తీసుకుందాం. విద్యుత్ డిస్కమ్‌లు అప్పనంగా షావుకార్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్‌  కార్మికులారా పిడికిలి ఎత్తి బీఆర్‌ఎస్‌ను బలపరచండీ... విద్యుత్‌ను పబ్లిక్ సెక్టార్‌లోనే ఉంచుకుందాం. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత్ దేశంలో మంచినీళ్లు ఇవ్వలేని పాలకులు కావాలా... కరెంటు ఇవ్వలేరు.. మంచి నీళ్లు ఇవ్వలేరు. వీళ్ల మాటలు నమ్మి ఎదుకు మోసపోవాలి. అవసరమైన చోట పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిందే. 

బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్: కేసీఆర్‌

కాంగ్రెస్ బీజేపీ దొందూ దొందే. బీజేపీ ఉంటే కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌ ఉంటే బీజేపీని తిట్టడమే వారి పాలన. విద్యుత్‌కు ఏమైందీ... ఈ దేశంలో అందుబాటులోఉన్న విద్యుత్‌ 4లక్షల పదివేల మెగావాట్లు. ఏరోజు కూడా రెండు లక్షల పదివేల మెగావాట్లకు మించి వాడలేదు. అనేక థర్మల్ పవర్ స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే... స్ట్రేషర్‌ అసెట్స్ అని పేరు పెట్టి ఎన్సీఎల్టీ పంచాయితీ పెట్టి వాటిని మూలకు పెట్టి కూర్చున్నారు. దేశమంతటా ఇవాళ కరెంటు కోతలతో ఇబ్బంది పడుతోంది. ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్‌ఎస్‌ లాంటి పార్టీ అధికారంలోకి వస్తే వెలుగుజిలుగు భారతాన్ని తయారు చేస్తాం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమంటే... రేవ్డీ కల్చర్ అని రైతులను అవమాన పరుస్తున్నారు. వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి సిగ్గుపడాలి. రైతులు ధర్నాలు చేస్తే దుస్థితా ఇది. ఇదేనా పాలించే విధానం. దేశానికి కావాల్సింది ఇదేనా. ఇష్టం ఉన్న వాళ్లకు దోచి పెట్డడానికి యత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉచిత కరెంటు ఇచ్చి తీరాలి. రేపు బీఆర్‌ఎస్‌ ప్రతిపాదించే ప్రభుత్వం వస్తే.. దేశవ్యాప్తంగా ఉచిత కరెంటు ఇస్తాం. - కేసీఆర్, తెలంగాణ సీఎం 

ఆ ప్రశ్నే నా మదిని కలచి వేస్తోంది?: కేసీఆర్

ఒకే మాట నా మనసు కలచి వేస్తోంది. ఇవాళ భారత్‌ సమాజం లక్ష్యం ఏంటి? ఏమైనా ఉందా... భారత్ తన లక్ష్యాన్ని కోల్పోయిందా... దారి తప్పిందా.. దేశంలో ఏం జరుగుతోంది. ఇది అనేక రోజులుగా నన్ను కలచి వేస్తున్న ప్రశ్న. దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి.. ప్రపంచ బ్యాంకు, అమెరికా, విదేశీయుల అవసరం లేని.. ఈ దేశ ప్రజల సొత్తు. లక్షల కోట్ల, రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఏమవుతున్నాయి. ఉండి కూడా ఎందుకు యాచకులం కావాలి. అమెరికా మన కంటే రెండున్నర రెట్లుపెద్దది. వాళ్లకు వ్యవసాయ భూముల శాతం 29శాతం. చైనా వాళ్లకు వ్యవసాయ భూమి 16 శాతమే. మన దేశంలో యాభై శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉంది. పుష్కలంగా ఉన్న నీటి వనరులను కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. అద్భుతమైన సూర్య కాంతి మనకు అందుబాటులో ఉంది. మూడు ఆగ్రో క్లైమెటిక్ జోన్స్ ఉన్నాయి. ఆపిల్ కూడా పండుతుంది. మామిడి కూడా పండుతుంది. ఇదే వేరే దేశాల్లో లేదు. కష్టపడి పని చేసే మంచి మానవవనర్లు ఉన్నాయి. ఇలాంటి దేశంలో మెక్‌డొనాల్డ్‌ ఫుడ్డా మనం తినేది. ఇలాంటి దేశంలో కెనాడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటామా... ఇది మన విధానామా.. 
దీనికి ఎవరు బాధ్యతులు. ఎక్కడ మనం మోసపోతున్నాం. మన నీళ్లన్నీ సరైన పాలన వచ్చి నీళ్లన్నీ పొలాల దాహం తీర్చాలా... ఇలానే ఉండాల అనేది ప్రశ్నించుకోవాలి. ఇది సాధించడానికే పుట్టింది బీఆర్‌ఎస్‌. 

ప్రతి గ్రామ పంచాయతీకి పది లక్షలు: కేసీఆర్

భాష అర్థం కాకపోయినా చాలా ఓపికతో ఉన్నారంటే... ఈ దేశంలో ప్రబలమైన మార్పునకు సంకేతంగా భావిస్తున్నాను. ఖమ్మంలో జిల్లాలో 589 గ్రామ పంచాయితీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయితీకి పది లక్షలు మంజూరు చేస్తున్నాం. పది వేల జనాభాకు మించిన ఉన్న మేజర్ పంచాయతీలకు పది కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నాం. మున్నేరు నదిపై కొత్త బ్రిడ్జి మంజూరు చేస్తాం. ఇతర మున్సిపాలిటీలకు తలో 30 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఖమ్మం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తాం. కొత్త కోర్టులు ప్రవేశ పెడతాం. ఖమ్మం హెడ్‌ క్వర్టర్స్‌లో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. నేల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేసిస్తున్నాను. 


-సీఎం కేసీఆర్

సీఎంలపైకి గవర్నర్లను రెచ్చగొడుతోంది: కేజ్రీవాల్‌

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశం ఇంకా వెనుకబడే ఉంది. కేరళలో విద్య వైద్యం బాగుంది. మిగతా రాష్ట్రాల్లో ఎందుకు బాగాలేదు. గవర్నర్లను సీఎంల మీదికి కేంద్రం పంపిస్తోంది. మన తర్వాత స్వాతంత్ర్యం పొందిన సింగపూర్ అభివృద్ధిలో దూసుకెళ్తోంది. 


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం 

కంటి వెలుగు కార్యక్రమాన్ని ఢిల్లీలో అమలు చేస్తాం: సీఎం కేజ్రీవాల్

సీఎం కేసీఆర్‌ను పెదన్నగా సంబోధించిన కేజ్రీవాల్. ఉచిత కంటి వైద్యం చాలా మంచి కార్యక్రమం. ఇవాళ రెండు గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కంటి వెలుగు కార్యక్రమం ఢిల్లీలో అమలు చేయబోతున్నాం. దిల్లీ మొహల్లా క్లినిక్‌లు ఇక్కడ బస్తీ దవాఖానాలుగా వచ్చాయి. ఢిల్లీలో స్కూల్ కార్యక్రమాలను స్టాలిన్ పరిసీలించారు. మేం ఒకరి నుంచి ఒకరం నేర్చుకుంటున్నాం.  ఢిల్లీలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు.  -అరవింద్‌ కేజ్రీవాల్‌, ఢిల్లీ సీఎం 

పంజాబ్‌లో కూడా తెలంగాణ కార్యక్రమాలు చేపడతాం: సీఎం భగవంత్‌ సింగ్ మాన్

ప్రజలఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామన్నారు. ఇంత వరకు వేయలేదు. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ కుట్రలు చేశారు. లూటీ చేయడం అమ్మడమే బీజేపీ సిద్ధాంతం. పంజాబ్‌లో కూడా తెలంగాణ లాంటి కార్యక్రమాలు చేపడతాం. మంచి కార్యక్రమాలు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు.  -భగవంత్‌ సింగ్‌ మాన్‌, పంజాబ్ సీఎం 

బీజేపీ అంటే భారతీయ జుమ్మా పార్టీ: పంజాబ్ సీఎం

ఇవాళ చాలా మంచి ప్రోగ్రామ్‌ను చూశాను.  ప్రజలకు ఉచిత కళ్ల అద్దాలు ఇవ్వడం. వారి సంక్షేమం కోసం చేపట్టే ఈ కార్యక్రమం చాలా మంచి ప్రయోజనాలు ఇవ్వనుంది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున జనం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది మార్పునకు తొలి అడుగు. దేశం ఎటు వెళ్తుందోనే ఆందోళన అందరిలో ఉంది. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ. బీజేపీ చేస్తోంది లోక్‌ తంత్ర కాదని లూట్ తంత్రా.   
యువతకు, రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు నెరవేర్చలేదు. రైతులు ఆదాయాలు రెట్టింపు చేస్తామని మోసం చేశారు. 
- భగవంత్‌ సింగ్‌ మాన్, పంజాబ్ సీఎం  

భవిష్యత్‌లో వన్ నేషన్ వన్ లీడర్ అంటారు: డి. రాజా

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఫెడరల్‌ సిస్టమ్‌పై నమ్మకం లేదని అందుకే తమకు నచ్చినట్టుగానే దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు రాజా. దీని వల్ల దేశంలో లౌకికతత్వం ప్రమాదంలో పడిందన్నారు. అందుకే వన్‌ నేషన్ వన్‌ పెషన్, వన్‌ నేషన్ వన్‌ ట్యాక్, అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారని ఆరోపించారు. ఇలా చేస్తూ చివరకు వన్‌ నేషన్, వన్‌ పార్టీ, వన్‌ నేషన్ వన్‌ లీడర్ అనే పరిస్థితి వస్తుందని ఆరోపించారు. విద్య, ఆరోగ్యం, ఉద్యోగం అనే ముఖ్యమైన అంశాలను కేంద్రం విస్మరిస్తోందన్నారు. అందుకే ఇండియాను, రాజ్యాంగాన్ని ఎలా రక్షించుకోవాలనే అంశంతో అందరం ఒక చోటకు వచ్చామన్నారు. గవర్నర్‌ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్‌లను అక్కడి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. 

దేశాన్ని హిందూ దేశంగా మార్చేస్తున్నారు: డి. రాజా

తెలుగులో మాట్లాడి ప్రసంగాన్ని ప్రారంభించారు సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా. తెలంగాణ కోసం అమరులైన పోరాట యోధులకు డీ రాజా నివాళి అర్పించారు. తెలంగాణ ప్రజలకు మంచి  పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు డీ రాజా అభినందనలు తెలియజేశారు. ప్రజలందరికీ మంచి తాగు నీరు అందివ్వడంతోపాటు, కోతల్లేని విద్యుత్ అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు అభినందలు తెలిజేశారు. బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో దేశంలో రాజ్యాంగ హననం జరుగుతోందన్నారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలిస్తున్నారని విమర్శించారు. 

మోదీ ప్రభత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్: అఖిలేష్‌ యాదవ్‌

రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.ఏమైందని ఖమ్మం వేదికగా అఖిలేష్ యాదవ్ బీజేపీని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు సరైన మద్దతు ధర లభించడం లేదు. దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోంది. జీ 20 సమావేశాలను కూడా కేంద్రం తన ప్రచారానికి వాడుకుంటోందని మండిపడ్డారు. ఇన్ని తప్పులు చేసిన బీజేపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది- అఖిలేష్ యాదవ్‌

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కూలడం ఖాయం: అఖిలేష్ యాదవ్

ఖమ్మం వేదికపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశానికి మంచి సందేశం ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్. ఎన్నికైన ప్రభుత్వాలను బీజపీ ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ దిగిపోవడం ఖాయమన్నారు. ప్రశ్నించిన నేతలను ఇబ్బంది పెట్టడం కేంద్రానికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. -అఖిలేష్ యాదవ్‌, యూపీ మాజీ సీఎం

కేరళ సీఎం విజయన్‌ను సన్మానించిన తెలంగాణ సీఎం కేసీఆర్

కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు సన్మానం చేశారు. తర్వాత ఆయన కేరళ బయల్దేరి వెళ్లారు.  

సంపద పంపిణీలో కూడా విపవక్ష: విజయన్‌

రాష్ట్రాలకు సంపదను పంచడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు కేరళ సీఎం పినరయి విజయన్‌. జీడీపీ, పారిశ్రామిక వృద్ధి రోజురోజుకు క్షీణిస్తోందన్నారు. విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయని ఆరోపించారు. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి డబ్బులు లేవని చెప్పే కేంద్రం.. కార్పొరేట్‌ కంపెనీల రుణాలు మాత్రం మాఫీ చేస్తోందని ఆరోపించారు. 

హిందీని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు: విజయన్‌

ఏ భాషకు ఆ భాష ప్రత్యేకమైందన్నారు కేరళ విజయన్‌. హిందీని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై కేంద్రం మితిమీరిన జోక్యం ఉందని ఆరోపించారు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ మధ్య కాలంలో ఉపరాష్ట్రపతి కూడా రాజ్యంగ విరుద్దంగా మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై దాడి చేశారని విమర్శించారు. 

రాష్ట్ర హక్కులను కేంద్రం కబళిస్తోంది: విజయన్‌

కేంద్రం తీరు కారణంగా అన్ని రాష్ట్రప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు కేరళ సీఎం. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటోందన్నారు.  కార్పొరేట్ శక్తులకే కేంద్రం ఊతమిస్తోందన్నారు. కేంద్రం వైఖరితో లౌకిక తత్వం ప్రమాదంలో పడిందన్నారు. సమాఖ్య`స్పూర్తిని దెబ్బతీస్తున్నారన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ బలహీన పరుస్తోంది.

కేంద్రంపై పోరాటానికి కేసీఆర్ నడుంబిగించారు: కేరళ సీఎం పినరయి విజయన్‌

ప్రజాఉద్యమాన్ని తీసుకొచ్చి ఒకే ఆలోచన కలిగి ఉన్న జాతీయ నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు అభినందనలు. కేంద్రం వైఖరితో రాజ్యాంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. అలాంటి కేంద్రంపై పోరాడటానికి సీఎం కేసీఆర్ నడుంబిగించారు. తెలంగాణ పోరాటాల గడ్డ. ప్రజాసంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. తెలంగాణ తరహాలోనే కేరళ కూడా చాలా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణలో సాయుధ పోరాటం భూసంస్కరణలకు కారణమైంది. స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొనని శక్తులు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. 


- పినరయి విజయన్- కేరళ సీఎం

ఖమ్మం జిల్లాలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం: తమ్మినేని వీరభద్రం

కులవ్యవస్థను, రాజ్యాంగాన్ని దాని మౌలిక స‌్వరూపాన్ని మార్చడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం, మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేయడం ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం, మధ్యయుగాల నాటి ఫ్యూడల్ ఆధిపత్యాన్ని అమలు చేయడం బీజేపీ లక్ష్యం. అలాంటి బీజేపీని కొనసాగించడమంటే దేశాభివృద్ధిని నాశనం చేసినట్టే. మత, కుల మతాలకు అతీతంగా ద్వేషాలు లేకుండా ఉంటున్నాం... ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ లక్ష్యం. ఎక్కడైనా బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే... అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మతాల చిచ్చు రేగి ఉంటుంది గమనించండి. సమాజం బాగుండాలంటే.. బీజేపీ అధికారంలోకి రాకూడదు... అధికారంలో ఉండకూడదు. ఖమ్మం జిల్లాలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి వాటిపై సీఎం దృష్టి పెట్టాలి. దుమ్ముగూడెం ప్రాజెక్టు, పోడుభూముల సమస్య, నాన్‌ గిరిజనుల సమస్య ఉంది వాటిని పరిష్కరించాలని కోరుతున్నాం. -తమ్మినేని వీరభద్రం, సీపీఐ  సీనియర్‌ నేత 

కంటివెలుగు కార్యక్రమం, ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభించిన సీఎంలు

తెలంగాణలో దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని  ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌సహా కేజ్రీవాల్, భవంత్‌ మాన్‌, పినరయి విజయన్‌, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ప్రారంభించారు. అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించారు.

నిన్నే హైదారాబాద్ చేరుకున్న జాతీయ నాయకులు

నిన్నే హైదరాబాద్ చేరుకున్న జాతీయ నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. ఖమ్మం సభలో పాల్గొనేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తోపాటు ఇతర జాతీయ నాయకులు హైదరాబాద్ చేరుకున్నారు. వారిని విమానాశ్రయం నుంచి మంత్రులు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకొచ్చారు.





యాదాద్రిలో కేసీఆర్‌, కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ ప్రత్యేక పూజలు- కాసేపట్లో ఖమ్మం పయనం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో సీఎం కేసీఆర్‌ సహా సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో అల్పాహారం ముగించుకొని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో సీఎంలు యాదాద్రి చేరుకున్నారు. అక్కడి ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి సీఎంలు కేసీఆర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు కేసీఆర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వారితోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర నేతలు కూడా ఉన్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రులకు వేదమంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

Background

BRS Public Meeting Live Updates: భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయ జీవితంలో గర్జనలది కీలక పాత్ర. తెలంగాణ కోసం ఉద్యమించాలనుకున్నప్పుడు ఆయన మొదటి గర్జన పెట్టారు. తన పోరాటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే పద్దతిలో జాతీయ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి భారత సింహ గర్జనతో ఖమ్మం నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ తరహాలో సక్సెస్ అవుతారో లేదో కాలం నిర్ణయిస్తుంది కానీ.. దేశాన్ని ఆకర్షించే బహిరంగసభలు నిర్వహించడంలో మాత్రం ఆయన ఎప్పుడూ ముందుంటారు. 


గర్జన సభలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన కేసీఆర్ 
 
భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో కేసీఆర్‌  ది అందే వేసిన చేయి. తెలంగాణ ఉద్యమానికి ఊపు బహిరంగసభల ద్వారానే వచ్చింది. ఇదే స్ఫూర్తితో టీ-ఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధం య్య్యారు.   2001లో కరీంనగర్‌ సింహగర్జన మొదలు 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో జరిగిన తెలంగాణ మహా గర్జన వరకు విజయవంతమైన అనేక బహిరంగ సభలు కేసీఆర్‌ ఉద్యమ స్పూర్తిని రెట్టింపు చేశాయి.  టీ-ఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీగా రూపాంతరం చెందాక ఖమ్మం గడ్డపై బుధవారం నిర్వహించే బహిరంగ సభను దేశం ఆకర్షించే విధంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.  ఇక్కడి నుంచి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ శంఖారావం పూరించను న్నారు. 


2001లో టీఆర్ఎస్ పెట్టిన కొద్ది రోజులకే కరీంనగర్‌లో గర్జన 


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పిన కొద్ది రోజులకే 2001 ఏప్రిల్‌ 27న కరీంనగర్‌లో పార్టీ ఆవిర్భావ సభ, ఆ తర్వాత హన్మకొండలో నిర్వహించిన మరో బహిరంగ సభ ఉద్యమ వేడి పెంచింది.  అది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సమయం.  ఎన్నికల్లో  విజయాలు సాధించి తెలంగాణ ప్రత్యేక ఆకాంక్షను వెలుగెత్తి చాటారు. అలాగే 2003లో వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభ తెలంగాణ వాదాన్ని జాతీయ స్థాయిలో బలంగా వినిపించే ప్రయత్నం చేశారు.  మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగసభ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టేలా చేసిందని చెబుతారు.   వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డి పేటలో 2010 డిసెంబర్‌ 16న నిర్వహించిన తెలంగాణ మహాగర్జన బహిరంగసభ రికార్డు సృష్టించింది.


టీఆర్ఎస్ ఆవిర్భావం.. బీఆర్ఎస్ ఆవిర్భావం ! 


2001లో టీ-ఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత కరీంనగర్‌లో నిర్వహించిన ‘సింహ గర్జన’ బహిరంగసభ స్వరాష్ట్ర ఆకాంక్షను ఏ స్థాయిలో ప్రతిబింబించిందో.. అదే రీతిలో  ఖమ్మంలో ‘భారతగర్జన’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించి కేసీఆర్ జాతీయ నాయకుడిగా చర్చల్లో ఉండాలని భావిస్తున్నారు.  నాడు తెలంగాణ వెనుకబాటుతనాన్ని ఎత్తిచూపి, ఇక్కడి ప్రజల అవసరాలు, సాధించాల్సిన లక్ష్యాలను వెల్లడిస్తూ ఉవ్వెత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించారు. అదే పంథాతో నేడు దేశ ప్రజల అవసరాలు, సంపద సృష్టించే మార్గాలు, రైతు సంక్షేమంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి మరో ప్రజా ఉద్యమానికి బీజం వస్తామని బీఆర్ఎస్ నేతలంటున్నారు.   భారత రాష్ట్ర సమితి అధినేత తొలి బహిరంగ సభ ద్వారా దేశగతిని మార్చేందుకు, ప్రజల దుర్గతిని మాపేందుకు ఉద్యమ పథగామి కేసీఆర్‌ కదన శంఖారావం పూరించనున్నారు. మూడు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విపక్ష పార్టీల జాతీయ నేతలు తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించనునున్న చారిత్రక వేదిక కాబోతున్నదని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా ?


విపక్షాల తరపున కేసీఆర్ ప్రధాని అభ్యర్థిగా ఖమ్మం సభ తర్వాత జాతీయ  రాజకీయాల్లో కేసీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందని బీఆర్ఎస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. అయితే కేసీఆర్ కన్నా బలమైన ప్రాంతీయ పార్టీల నేతలయిన కేజ్రీవాల్, మమతా  బెనర్జీ, నితీష్ కుమార్ లాంటి వారు ఉండగా.. కేసీఆర్ ను ఎందుకు ప్రకటిస్తారని ఇతరులు ప్రశ్నిస్తున్నారు . కానీ బీజేపీపై యుద్ధం చేయడంలో కేసీఆర్ అందరి కన్నా  ముందు ఉన్నారని.బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.