Severe Road Accident At Medchal Check Post: మేడ్చల్ చెక్ పోస్ట్ (Medchal Checkpost) వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ ముగ్గురిని బలి తీసుకుంది. ఓ కుటుంబం బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని దంపతులతో సహా కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.
Road Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం - బైక్ను లారీ ఢీకొని ముగ్గురు మృతి
Ganesh Guptha
Updated at:
05 Jan 2025 05:14 PM (IST)
Medchal News: మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద ఘోర ప్రమాదం