Virat Kohli News: అగ్రెషన్ కు ప్రతిరూపం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని మనకు తెలిసిందే. తనను కవ్విస్తే వాళ్లకు తగిని రీతిలో బుద్ధి చెప్పేందుకు ఏమాత్రం వెనుకాడడు. తాజాగా అలాంటి సంఘటనే సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో జరిగింది. సాండ్ పేపర్ యూస్ చేస్తున్నారా..? అన్నట్లు గేలి చేసిన ఆసీస్ ఫ్యాన్స్ కు విరాట్ తన దైన శైలిలో బుద్ధి చెప్పాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది. ఆసీస్ అభిమానుల నోరు మూయించావని కోహ్లిని పొగుడుతూ, ఆ వీడియోపై కామెంట్లు చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు.
ఇంతకీ ఏముందా వీడియోలో..
తొలుత ఆసీస్ అభిమానులు ఒక వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆదివారం మూడో రోజు భారత క్రికెటర్లు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఒక ప్లేయర్ తన షూను సర్దుకుంటున్నప్పుడు అందులో నుంచి చిన్న చీటీలాంటిది పడింది. ఆ క్లిప్పింగ్ ను తీసుకుని, సాండ్ పేసర్ లాంటి వాటితోని ఇండియా ఏమైనా ఫిక్సింగ్ చేస్తుందా..? అన్నట్లుగా కామెంట్లు చేస్తూ వీడియోను వైరల్ చేశారు. స్టేడియంలోని అభిమానులు కూడా ఈ విధంగా అరుస్తూ, భారత క్రికెటర్లకు అసౌకర్యాన్ని కలిగించారు.
కోహ్లీ.. స్ట్రాంగ్ రిప్లై..
కంగారూ అభిమానులకు బుద్ది చెప్పాలని భావించిన కోహ్లీ, మ్యాచ్ మధ్యలో తన జేబుల్లో సాండ్ పేపర్ లేవని, ఖాళీ జేబులను బయటకు ప్రదర్శించాడు. అలాగే ప్యాంట్ లోపల కూడా సాండ్ పేపర్ లేదని సైగ చేశాడు. అలాగే ఇలాంటి పాడు పనులు ఆస్ట్రేలియన్లు చేసినట్లుగా భారత ఆటగాళ్లు చేయరని ఎద్దేవా చేస్తూ చేతులతో సైగలు చేశాడు. ఇక సాండ్ పేపర్ గేట్ వివాదానికి వస్తే, 2018 సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరున్ బ్యాంక్రాఫ్ట్ సాండ్ పేపర్ ను ఉపయోగించి బంతిని టాంపర్ చేయాలని ప్రయత్నించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈ ముగ్గురిపై నిషేధం పడింది. ఆ తర్వాత స్మిత్, వార్నర్ కొంతకాలానికి జాతీయ జట్టులోకి రాగా, బ్యాంక్రాఫ్ట్ పై జీవితకాల నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా విధించింది.
మరోవైపు స్మిత్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసినప్పుడు భారత పర్యటనలోఅతడిని ప్రేక్షకులు గేలి చేస్తున్నప్పుడు కోహ్లీ.. స్మిత్ కు అండగా నిలవడం విశేషం. అయితే అప్పుడు కోహ్లీ చేసిన మేలును కూడా ఆసీస్ అభిమానులు మర్చి పోయారని భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదాన్నే ఎత్తి చూపి, ఆసీస్ ఫ్యాన్స్ కు కోహ్లీ చురకలు అంటించారు. ఇక ఐదో టెస్టులో గెలిచిన ఆసీస్ 3-1తో బోర్డర్ -గావస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో పదేళ్ల తర్వాత ఈ ట్రోఫీని దక్కించుకోవడంతోపాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది.