SCR Special Trains For Sankranti: సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఆ 3 రోజులూ తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు సొంతూళ్లకు పయనమవుతారు. ఈ క్రమంలో రద్దీ దృష్ట్యా ద.మ రైల్వే (South Central Railway) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. 52 అదనపు రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకూ ఆయా ప్రాంతాలకు ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.


పూర్తి వివరాలు..



  • జనవరి 6, 7 తేదీల్లో చర్లపల్లి - తిరుపతి - చర్లపల్లి (రైలు నెం: 07077/07078)

  • ఈ నెల 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో చర్లపల్లి - తిరుపతి - చర్లపల్లి (02764/02763) మొత్తం 6 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

  • ఈ నెల 13న వికారాబాద్ - కాకినాడ టౌన్ (07037), ఈ నెల 14న కాకినాడ టౌన్ - చర్లపల్లి (07038).

  • ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో కాచిగూడ - తిరుపతి - కాచిగూడ మొత్తం 4 సర్వీసులు నడపనున్నారు.

  • ఈ నెల 11, 12, 18, 19 తేదీల్లో చర్లపల్లి - నర్సాపూర్ - చర్లపల్లి (07035/07036)

  • ఈ నెల 12, 19 తేదీల్లో కాకినాడ టౌన్ - సికింద్రాబాద్

  • ఈ నెల 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 18 తేదీల్లో చర్లపల్లి - నర్సాపూర్ - చర్లపల్లి (07033/07034) మొత్తం 10 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

  • ఈ నెల 8, 9, 10, 11, 12, 13, 14, 15 చర్లపల్లి - కాకినాడ టౌన్ - చర్లపల్లి (07031/07032) మొత్తం 8 సర్వీసులు నడపనున్నారు.

  • ఈ నెల 6, 7, 13, 14 తేదీల్లో నాందేడ్ - కాకినాడ టౌన్ - నాందేడ్ (07487/07488).

  • ఈ నెల 9, 10, 12, 13, 14, 15 తేదీల్లో చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి (07025/07026) 6 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

  • ఈ నెల 7, 8 తేదీల్లో కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ (07041/07042) రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.






Also Read: Tiger Zone: అర్ధరాత్రి టైగర్ జోన్లో దారులు మూసివేత, ఫోన్ రావడంతో హుటాహుటీన అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే