ABP  WhatsApp

Election Results 2024

(Source: ECI/ABP News/ABP Majha)

MM Naravane: 'దేశ రక్షణలో స్త్రీ శక్తి.. మహిళలకు సాదరంగా ఆహ్వానం పలుకుదాం'

ABP Desam Updated at: 29 Oct 2021 04:28 PM (IST)
Edited By: Murali Krishna

దేశ రక్షణ కోసం వచ్చే మహిళలను సాదరంగా ఆహ్వానించాలని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే పిలుపునిచ్చారు.

దేశ రక్షణలో మహిళల ప్రాధాన్యంపై సైన్యాధిపతి కీలక వ్యాఖ్యలు

NEXT PREV

పుణెలో జరిగిన ఎన్​డీఏ 141వ పాసింగ్​ అవుట్​ పరేడ్​ను సైన్యాధిపతి ఎంఎం నరవాణే సమీక్షించారు. ఈ సందర్భంగా మహిళా క్యాడెట్లను సాదరంగా స్వాగతించాలని కోరారు. మహిళా క్యాడెట్లకు ఎన్​డీఏ(నేషనల్​ డిఫెన్స్​ అకాడమీ) వృత్తి నిబద్ధత, నిష్పక్షపాతంతో ఆహ్వానం పలకాలని పిలుపునిచ్చారు. 







ఎన్​డీఏలో త్వరలోనే మహిళా క్యాడెట్లు కూడా చేరుతారు. పురుషులకు సమానంగా వారు శక్తిసామర్థ్యాలను కనబరుస్తారని ఆశిస్తున్నా. లింగసమానత్వానికి ఇదొక ముందడుగు. భారత సాయుధ దళాలపై ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ఉంది. మహిళలకు కూడా అలానే స్వాగతం లభిస్తుందని ఆశిస్తున్నా. 42 ఏళ్ల క్రితం ఇదే పరేడ్​లో నేను క్యాడెట్​గా పాల్గొన్నా. అయితే ఎప్పుడూ ఇలా పరేడ్​ను సమీక్షిస్తానని ఆనాడు ఊహించలేదు. ఇక్కడి నుంచి మీ కఠోర సైనిక శిక్షణ మొదలవుతుంది. త్రిదళాలకు చెందిన యూనిఫాంలు మీరు ధరిస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరొక్కరే ఆధునిక యుద్ధాన్ని గెలవలేరు. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలి. అదే సమయంలో నూతన సాంకేతికతపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటే సవాళ్లను ఎదుర్కోవచ్చు.                              - ఎంఎం నరవాణే, భారత సైన్యాధిపతి






మహిళల కోసం ఎన్​డీఏ ప్రవేశపరీక్ష వచ్చే ఏడాది మే నెలలో నిర్వహిస్తామని గత నెలలో సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. అయితే అప్పటివరకు వాయిదా వేయడం తగదని, ఈ నవంబర్​లోనే పరీక్షలు పెట్టాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. 


రాజ్‌నాథ్ ఆకాంక్ష..


దేశ రక్షణలో మహిళల ప్రాతనిధ్యం పెరగాలని ఇటీవల షాంఘై సహకార సదస్సుకు సంబంధించిన వెబినార్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ గుర్తుచేశారు. దేశాన్ని పాలించడానికే కాదని సైన్యాన్ని నడిపించే స్థాయికి కూడా మహిళలు ఎదుగుతారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.


భారత సైన్యంలో మహిళలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. త్వరలోనే మహిళా అధికారులు సైన్యాన్ని నడిపించే స్థాయిలో ఉంటారని, బెటాలియన్లకు నాయకత్వం వహిస్తారని వెల్లడించారు. 


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 14,348 కరోనా కేసులు, 805 మరణాలు నమోదు


Also Read: WHO ON Covaxin: భారత్ టీకాలు భేష్.. కొవాగ్జిన్‌కు త్వరలోనే అనుమతి: డబ్ల్యూహెచ్ఓ


Also Read: G20 Summit 2021: రోమ్ చేరుకున్న ప్రధాని.. జీ20, కాప్- 26 సదస్సులతో మోదీ బిజీ


Also read:  అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే


Published at: 29 Oct 2021 04:25 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.