కొవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతిని ఇవ్వడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) కోసం అవసరమైన సమాచారాన్ని భారత్ బయోటెక్ చాలా వేగంగా అందజేస్తోందని డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. కొవాగ్జిన్ ఆమోదంపై నిపుణుల కమిటీ వచ్చేవారం తుది నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.
భారత్ టీకాలు భేష్..
అత్యంత నాణ్యత కలిగిన టీకాలను భారతీయ సంస్థలు ఉత్పత్తి చేస్తాయని డబ్ల్యూహెచ్ఓ బలంగా నమ్ముతుందని ఆమె అన్నారు.
ఇటీవల కొవాగ్జిన్‌కు అనుమతి వస్తుందని అంతా భావించినప్పటికీ తుది మదింపునకు గాను భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం అవసరమని డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం తెలిపింది.
నవంబర్ 3న..
ఈ వారాంతంలో భారత్ బయోటెక్ నుంచి అవసరమైన సమాచారం అందుతుందని సాంకేతిక సలహా బృందం ఆకాంక్షించింది. తుది మదింపునకు నవంబర్ 3న సమావేశం కానుంది.
దేశంలో ఇప్పటికే కోట్లాది మంది కొవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. అయితే ఈ టీకా పొందిన వాళ్లు విదేశాలకు వెళ్లడం కష్టతరంగా మారుతోంది. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని భారత్ బయోటెక్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. చాలా దేశాలు డబ్ల్యూహెచ్ఓ ఇచ్చే ఈ అనుమతులను ఆధారంగా చేసుకుంటున్నాయి. దీంతో కొవాగ్జిన్ టీకా వేసుకున్న భారతీయులకు విదేశీ ప్రయాణాలు కష్టంగా మారాయి.
కరోనాపై తయారు చేసిన తొలి దేశీయ టీకా కొవాగ్జిన్. ప్రపంచవ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోన్న సమయంలో కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ తయారు చేసింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కరోనా డెల్టా వేరియంట్లను కూడా సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నట్లు తేలింది.
Also Read: G20 Summit 2021: రోమ్ చేరుకున్న ప్రధాని.. జీ20, కాప్- 26 సదస్సులతో మోదీ బిజీ
Also read: అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు