Breaking News Live Telugu Updates: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది: యువగళం సభలో నాదెండ్ల మనోహర్

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 20 Dec 2023 07:02 PM
యువగళం ముగింపు సభ కాదు, వైసీపీ అంతిమయాత్రకు ఆరంభం: నందమూరి బాలకృష్ణ

నవశకం బహిరంగసభలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ


పాదయాత్ర అన్ని వర్గాల ప్రజలమధ్య విజయవంతంగా కొనసాగింది.


ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదు... వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ.


రాష్ట్ర యువతకు వైసీపీలో తమకు జరిగిన అన్యాయం, ఇబ్బందులను గుర్తుపెట్టుకోవాలి.


1982లో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు కులాలు,మతాలు,వర్గాలకు అతీతంగా విశేష స్పందన వచ్చింది.


అదేవిధంగా నేడు యువగళం పాదయాత్రకు అంతటి విశేష స్పందన వచ్చింది.


యువనేతపై ఈగ వాలకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు.


యువనేతకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.


పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సినిమాకే కాకుండా ప్రజాసమస్యలపై పోరాటానికి అధికంగా కేటాయిస్తున్నారు.


రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ తిరుగులేని పోరాటం చేశారు.


చంద్రబాబు తన విజన్ తో ఐటీ, డ్వాక్రాను తీసుకొచ్చారు.


ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు కొనసాగించి పేదలకు అండగా నిలిచారు.


ప్రపంచదేశాలకు చంద్రబాబు తన విజన్ ను పరిచయం చేశాడు.


జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, కూల్చివేతలను పరిచయం చేశాడు.


జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని నిర్వీర్యం చేసి రూ.10లక్షల కోట్ల అప్పు చేశాడు.


అరాచకపాలనలో ధరలు, పన్నులు, రేట్లు ఆకాశాన్నంటాయి...సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకమైంది.


జగన్ ల్యాండ్, శాండ్, మైన్ స్కాములతో దోచుకుంటున్నాడు..ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నాడు.


ఏపీకి రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వేధించాడు..అక్రమ కేసులతో బెదిరిస్తున్నాడు.


పోలీసులు, ఉద్యోగులు, కార్మికులను జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నాడు.
హిందూపురంలో ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో పెడితే జగన్ నిర్లక్ష్యంతో నేడు దానిలో పందులు, కుక్కలు తిరిగేలా పాడుబెట్టాడు.


జగన్ పాలనలో ఒక్క గుంత పూడ్చలేదు...ఒక్క రోడ్డు వేయలేదు.


సీఎం కుర్చీలో జగన్ కనకపు సింహాసనంపై శునకం మాదిరి ప్రవర్తిస్తున్నాడు.


జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానంటే అక్కడి ప్రజలు రాష్ట్ర సరిహద్దు వద్దే అడ్డుకుంటారు.


మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రపంచ పటంలో ఏపీ ఉండదు..ఇది తథ్యం.


సమయం లేదు మిత్రమా.... వచ్చే ఎన్నికల్లో విజయమా? వీరస్వర్గమా? అనేది రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి.


సొంత సామాజికవర్గాన్ని స్థానాల నుండి మార్చకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రమే ఓడిపోయే స్థానాల్లోకి పంపుతున్నాడు...ఇంక సామాజిక న్యాయం ఎక్కడా?


జగన్మోహన్ రెడ్డి చూపించేది కపట ప్రేమ..సవతి తల్లి ప్రేమ...దయచేసి ఎవరూ నమ్మొద్దు.


కప్ప బావి మాత్రమే తన ప్రపంచం అని భావించినట్లు...జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే లోకం అనుకుంటున్నాడు.


అణిచివేతలపై ఫ్రెంచి విప్లవం వచ్చిన విధంగా రాష్ట్ర ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలి.


రానున్న ఎన్నికల్లో సుపరిపాలనకు స్వాగతం పలకాలి...ఎవరికీ భయపడాల్సిన పనిలేదు.
రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రజలంతా నడుం బిగించాలి.


ఎవడు అడ్డొస్తాడో మేం చూస్తాం...మీరు ముందడుగు వేయండి

జగన్ పాదయాత్రకు మేం అడ్డంకులు సృష్టించలేదు, కానీ లోకేష్ కు అన్నీ ఇబ్బందులు: అచ్చెన్నాయుడు

నవశకం బహిరంగసభలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు


నారా లోకేష్ చంద్రబాబు వారసుడే కాదు... రాజకీయ పరిణితి కలిగిన నాయకుడని కుప్పం సభలోనే చెప్పాను.


పాదయాత్రలో నారా లోకేష్ బలమైన సైనికుడు అని కూడా రుజువు చేశారు.


జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మేం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు.


యువగళంపై జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించాడో రాష్ట్రమంతా చూసింది.


పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు...బాధితులను ఓదార్చాడు.


అవినీతి నాయకుల బాగోతాన్ని ప్రజల్లో ఎండగట్టాడు..యువతకు భరోసానిచ్చాడు.


చంద్రబాబు పైసా అవినీతి చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసు పెట్టి 53రోజులు జైల్లో పెట్టాడు.


2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలుస్తారని వైసిపి సైకోలు ఊహించలేదు.


మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి టీడీపీ, జనసేన ఏకం కావాల్సిన చారిత్రాత్మ అవసరం ఏర్పడింది.


ప్రజలకు సుపరిపాలన దక్కనివ్వకూడదని సైకో జగన్ అనేక డ్రామాలాడుతున్నారు.


రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన రాకుండా అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి తరం కాదు.


టీడీపీ, జనసేనలో బలహీన వర్గాల వారు నాయకులుగా పనిచేస్తున్నారు...వైసీపీలో బానిసలుగా పనిచేస్తున్నారు.


ఉత్తరాంధ్ర జిల్లాలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి రాసిచ్చాడు.


బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ కు చీము, నెత్తరు ఉంటే తక్షణమే వైసీపీకి రాజీనామా చేసి బయటకు రావాలి.


ఉత్తరాంధ్రకు జగన్ చేస్తున్న అన్యాయంపై నిలదీసే దమ్ము మీకుందా?


ఉత్తరాంధ్రను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు...దోచుకున్నాడు.


టీడీపీ, జనసేన కలిశాయి...ఇక వైసీపీకి దబిడిదిబిడే.


రానున్న ఎన్నికల్లో వైసీపికి డిపాజిట్లు కూడా రావు.


గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి.


కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తాడు..మనం అప్రమత్తంగా ఉండాలి.
2024లో ఏపీకి పట్టిన దరిద్రాన్ని రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయాలని కోరుతున్నా.


5కోట్ల ఆంధ్రులంతా గుర్తుపెట్టుకోవాలి..రానున్న ఎన్నికలు టీడీపీ-జనసేన – వైసీపీ మధ్య ఎన్నికలు కాదు.


రాష్ట్ర ప్రజలకు-దోపిడీదారుడికి మధ్య యుద్ధం.


ప్రజల కోసం ఒక్కటై టీడీపీ-జనసేన నాయకత్వాన్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి.

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది: యువగళం సభలో నాదెండ్ల మనోహర్

నవశకం బహిరంగసభలో జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్


రాష్ట్రంలో జరుగుతున్న దాష్టీకాలను అంతం చేయడానికి టీడీపీ-జనసేన కలయికను రాష్ట్రమంతా కోరుకుంటోంది.


టీడీపీ, జనసేన పార్టీలను అణగదొక్కాలని అనేక రకాలుగా వైసీపీ ప్రయత్నించింది.


చంద్రబాబు తన అనుభవంతో పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారు.


పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తుకోసం, రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ముందడుగు వేశారు.


చంద్రబాబును ములాఖత్ లో కలిసిన రోజు పవన్ కణ్యాణ్ చేసిన ప్రకటనపై రాష్ట్రమంతా హర్షించింది.


యువగళం ముగింపు సభకు లోకేష్ మాత్రమే ముఖ్య అతిథిగా ఉంటే బాగుంటుందని మేం భావించాం.


కానీ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తప్పకుండా రావాలి...రాష్ట్ర ప్రజల కోరికను గౌరవించాలని కోరారు.


వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. ఉపాధి, ఉద్యోగావకాశాల విషయాన్ని పూర్తిగా ప్రక్కనపెట్టింది.


2014లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపించారు.


2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవితవ్యాన్ని వెనక్కి నెట్టారు.


రాష్ట్ర యువత జగన్మోహన్ రెడ్డి పాలనలతో జరిగిన నష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఒక్క ఛాన్స్ కు అవకాశం ఇవ్వడం వల్ల ఎంత పొరపాటు జరిగిందో రాష్ట్రమంతా గమనించాలి.


టీడీపీ-జనసేన పార్టీలు సంయుక్తంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల ముందుకు  తెచ్చాయి.


రాష్ట్ర ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు అవసరమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు.


రానున్న రోజుల్లో అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం.


3123కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్ కు ప్రత్యేక అభినందనలు.


పాదయాత్రలో లోకేష్ సంపాదించిన అనుభవంతో సుపరిపాలన చేస్తారని దృఢమైన నమ్మకం ఉంది.


రాష్ట్రప్రజలంతా రాబోయే ఎన్నికల్లో జనసేన-టిడిపిలను ఆశీర్వదించండి.

యువగళం ద్వారా నారా లోకేష్ అనేక అడ్డంకులు దాటారు: పంచకర్ల రమేష్

నవశకం బహిరంగసభలో పెందుర్తి జనసేన ఇన్ ఛార్జి పంచకర్ల రమేష్


యువగళం ద్వారా రాష్ట్రానికి దశ,దిశ చూపేందుకు నారా లోకేష్ అనేక అడ్డంకులు దాటారు.


రాష్ట్రాన్ని బాగుచేయాలనే సంకల్పంతో టీడీపీ, జనసేన నాయకులు ఒక్కటయ్యారు.


రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించడమే ప్రధాన అజెండాగా ముందుకు కదులుతున్నారు.


ఉత్తరాంధ్రను రాజధానిగా చేస్తానని ఉద్యోగం, ఉపాధి, పరిశ్రమలు తీసుకురాకపోగా మా ప్రాంతాన్ని దోచుకుని, దాచుకున్నారు.


పెట్టుబడుల సదస్సు పెట్టి రూ.18.5లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు.


పరిశ్రమలు ఎక్కడ అని అడిగితే పరిశ్రమలశాఖ మంత్రి కోడి, గుడ్డు అని వాగుతున్నాడు.


విజనరీ చంద్రబాబు, కష్టం వస్తే నేనున్నా అని వచ్చే పవన్ కళ్యాణ్ కలయిక ఏపీకి స్వర్ణయుగం రాబోతోంది.

మహానాడును తలపిస్తున్న నవశకం ప్రాంగణం

యువగళం జైత్రయాత్ర ముగింపు సందర్భంగా పోలిపల్లి వద్ద నవశకం సభకు భారీగా చేరుకుంటున్న టిడిపి శ్రేణులు. తెలుగుదేశం పార్టీ పెద్దపండుగ మహానాడు తలపిస్తున్న నవశకం బహిరంగసభ ప్రాంగణం.రాయలసీమ, ఉత్తరకోస్తా నుంచి విశాఖపట్నం, విజయనగరం చేరుకున్న ప్రత్యేక రైళ్లు. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నవగళం సభకు అందుబాటులో ఉన్న వాహనాల్లో చీమలదండులా తరలివస్తున్న టిడిపి-జనసేన కార్యకర్తలు. సభకు వస్తున్న ఇరుపార్టీల శ్రేణులకు సాదరంగా స్వాగతం పలికి ఆతిథ్యమిస్తున్న విజయనగరం నేతలు. 

విశాఖ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

యువగళం నవశకం సభలో పాల్గొనడానికి విశాఖ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

గురుశిష్యులు, ఏపీ రిటైర్డ్ అధికారి తయారు చేసిన తప్పుల పత్రం- శ్వేతపత్రంపై హరీష్‌ విమర్శలు

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీమంత్రి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. గురుశిష్యులు వండి వార్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. తయారు చేసిన వారిలో ఏపీ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఉన్నారని తీవ్ర కామెంట్స్ చేశారు. అందులో పేర్కొన్న అంశాలు తప్పులని తేల్చేశారు. అప్పులను జీఎస్టీడీపీతో పోల్చేలేదని రెవెన్యూతో పోల్చడాన్ని హరీష్ తప్పుపట్టారు. తెలంగాణలో పెరిగిన అప్పులు వివరించిన ప్రభుత్వం పెరిగిన ఆస్తుల సంగతి మాత్రం పట్టించుకోలేదన్నారు. 

రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు : భట్టి విక్రమార్క

గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రవనరులను అన్నింటినీ అనుకున్న లక్ష్యాల దిశగా నడిపించలేదు. చివరికి రోజు వారీ ఖర్చులు కూడా వివిధ మార్గాల్లో తెచ్చుకొని పాలన చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 

Background

తెలంగాణ అసెంబ్లీ సమవేశాలు మరోసారి హాట్‌హాట్‌గా సాగనున్నాయి. వివిధ రంగాల్లో ఉన్న పరిస్థితులపై అసెంబ్లీ వేదికగా కొత్త ప్రభుత్వం లెక్కలకు విప్పబోతోంది. దీనికి దీటుగానే ప్రధాన ప్రతిక్షం బీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. ముందుగా ఇవాళ ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. 


తెలంగాణలో పవర్‌ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిని వివరించనున్నారు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న స్థితిని సభకు తెలియజేయనున్నారు. రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు పాలుచేసిందని ఆరోపిస్తోంది కొత్త ప్ఱభుత్వం. బడ్జెట్‌లో అంచనాలకు వాస్తవంగా ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉందని సంవత్సరాల వారీగా అప్పులు వివరిస్తారు. 


అన్ని రంగాల్లో ఉన్న స్థితిగతులను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందు ఆర్థిక పరిస్థితిని వివరించనున్న ప్రభుత్వం విద్యుత్‌లో ఉన్న లోపాలు సభకు తెలియచేస్తారు. తర్వాత సాగునీటి ప్రాజెక్టుల్లో వాస్తవ పరిస్థితులు చెప్పుకొస్తారు. ఇందులో ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెడతారు. తర్వాత ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ ఇలా శాఖలన్నింటిపై శ్వేత పత్రాలు సభ ముందు ఉంచబోతోంది ప్రభుత్వం. అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా హాట్ హాట్‌గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. 


ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ ముందుగా ఇటీవల కాలంలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలియజేయనుంది. రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజ సత్యవతి మృతికి సంతాపం తెలపనున్నారు. ఆ తర్వాతే ఆర్థికి స్థితిపై తొలి శ్వేత పత్రం సభ ముందు ఉంచబోతోంది. 


తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ లో కూడా వాతావరణం చల్లగా ఉంటోంది. రాత్రివేళే కాకుండా పగలు కూడా చలిగాలులు వణికిస్తున్నాయి. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.


ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఈశాన్య, తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. 


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 27.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.9 డిగ్రీలుగా నమోదైంది. 60 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య లేదా తూర్పు గాలులు వీయనున్నట్లు తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో నేడు రేపు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని.. ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా.. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.