Manchu Manoj Police complaint: మంచు వారసుల మధ్య నిప్పులు చల్లారడం లేదు. ఎవరు వారి మధ్య పచ్చగడ్డి వేస్తున్నారో కానీ ఎప్పటికప్పుుడు భగ్గుమంటూనే ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణుతో పాటు వినయ్ మహేశ్వరి తన ప్రాణాలకు హాని తలపెట్టేలా కుట్రలు చేస్తున్నారని .. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు ఇచ్చారు.
పోలీసులకు ఏడు పేజీల ఫిర్యాదు లేఖ ఇచ్చిన మనోజ్
ఈ ఏడు పేజీల ఫిర్యాదులో మంచు విష్ణు తనపై చేసిన దాడులు, కుట్రలకు సంబంధించిన వివరాలన్నీ పొందు పరిచినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తాను కుటుబంతో సహా ఇంట్లో ఉన్న సమయంలో ఇంటికి విద్యుత్ ను నియంత్రించే ఇన్వర్టర్ జనరేటర్ లో పంచదారు పోశారని తద్వారా షార్ట్ సర్క్యూట్ వంటి ఘటనలు జరిగి మొత్తం కుటుంబానికి హాని చేసే ప్రయత్నం చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. అయితే ఆయన తర్వాత రోజు తన భార్య మౌనిక తల్లి శోభానాగిరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆళ్లగడ్డ వెళ్లారు. అప్పుడు ఫిర్యాదు చేయలేదు.
Also Read: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
మనోజ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులకు మంచు నిర్మల లేఖ
ఆయన ఆళ్లగడ్డలో ఉన్న సమయంలోనే మంచు మనోజ్ తల్లి నిర్మల పోలీసులకు ఓ లేఖ రాశారు. మంచు మనోజ్ చేసిన ఫిర్యాదు తప్పుడుదని.. మంచు విష్ణు అలాంటి పంచదార ఏదీ ఇంటికి తీసుకు రాలేదన్నారు. తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేయడానికి కేకును మాత్రమే తీసుకు వచ్చాడని తెలిపారు. ఆ ఇంట్లోకి రావడానికి మనోజ్ కు ఎంత హక్కు ఉందో.. విష్ణుకుకూడా అంతే ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. అప్పటికీ మంచు మనోజ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఆ లేఖ విషయాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు.
Also Read: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
అరెస్టు భయంతో ఆజ్ఞాతంలో మంచు మోహన్ బాబు
తాజాగా మంచు మనోజ్ చేసిన ఫిర్యాదు హైలెట్ అవనుంది. విష్ణుతో పాటు ఆయన వ్యాపార భాగస్వామిగా ఉన్న వినయ్ మహేశ్వరి పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మరింది. మోహన్ బాబు అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. ఇరవై నాలుగో తేదీ తర్వాత ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న ఉద్దేశంతో ఆయన ఆజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఆయన పిల్లలు మాత్రం ఇలా పోలీసులకు ఫిర్యాదులు చేసుకుటూ పోరాటం కొనసాగిస్తున్నారు.