Permission is not required for five-storied buildings in AP:  ఎవరికైనా ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి అనుమతులు  తెచ్చుకోవడం చాలా పెద్ద సమస్య. అయితే ఈ సమస్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సింపుల్ గా పరిష్కార మార్గం చూపించింది. అదేమిటంటే.. ఐదు అంతస్తుల వరకూ ఇక పర్మిషన్లు అక్కర లేదని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తే సరిపోతుందని నారాయణ ప్రకటించారు. అమరావతిలో ఏపీలో ఉన్న 123 మున్సిపాలిటీల కమిషనర్లతో నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అనుమతుల అంశంపై చర్చకు వచ్చింది. ప్రజలు ఏ మాత్రం ఇబ్బంది పడకూడదని ఐదు అంతస్తుల వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి లేఔట్ అప్ లోడ్ చేసి.. రుసుము చెల్లిస్తే అనుమతులు వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఈ విధానాన్ని వెంటనే అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.                     


Also Read: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?


సాధారణంగా ఐదు అంతస్తులు అంటే అపార్టుమెంట్లు కూడా వస్తాయి. అంటే ఇప్పుడు అపార్టుమెంట్లు నిర్మించుకోవాలన్నా ఏపీలో అందరి చుట్టూ తిరగాల్సిన పని  లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండేలా భవనం ప్లాన్ ను రూపొందించుకుని ఆన్ లైన్ లో అప్ లోడ్ చూసి రుసుము చెల్లిస్తే అనుమతి వచ్చేసినట్లే అనుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి అనుమతుల కోసం మున్సిపాలిటీలోని ప్లానర్లు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి నారాయణ తెచ్చిన ఈ మార్పు రియల్ ఎస్టేట్ వర్గాలకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అంశంపై పూర్తి స్థాయి విధాన  ప్రకటన వెంటనే మున్సిపల్ శాఖ ప్రకటించే అవకాశం ఉంది. 


మున్సిపాలిటీకి సంబంధించి ప్రధాన పౌరసేవలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ .. మున్సిపల్ కమిషనర్లుకు తేల్చి చెప్పారు. వీధి దీపాలు, డ్రైనేజీ విషయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు నిర్వహణ సమర్థంగా ఉండాల్సిందేనన్నారు. 2014-19 మధ్య కాలంలో మున్సిపల్ శాఖ అధ్బుతంగా పని చేసిందని నారాయణ తెలిపారు. ఆ సమయంలో ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదన్నారు. అయితే తర్వాత వైసీపీ హయాంలో ఇంటిపన్నుతో పాటు చివరికి చెత్త పన్ను కూడా వేశారని అయినా మున్సిపాలిటీల నిర్వహణ అధ్వాన్నంగా మారిందన్నారు. 



Also Read: Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి