Paatal Lok Season 2: ప్రస్తుతం ఓటీటీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ లో 'పాతాళ్ లోక్' కూడా ఒకటి. 2020లో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా అలరించిన 'పాతాళ్ లోక్' సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెండవ సీజన్ ఎప్పుడెప్పుడు రాబోతోందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఓటీటీ లవర్స్ కు తాజాగా మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
అత్యధిక మంది వీక్షించిన వెబ్ సిరీస్
2020లో తెరపైకి వచ్చిన 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్ ఇండియాలోని టాప్ 10 బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచి రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు ఏకంగా ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ లో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. పైగా 'పాతాళ్ లోక్' ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్ సిరీస్ లలో ఒకటి. ఈ 'పాతాళ్ లోక్' సిరీస్ ఫస్ట్ సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో జైదీప్ అహ్లావత్, స్వస్తిక ముఖర్జీ, గుల్ పనాగ్, నీరజ్ కబీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుదీప్ శర్మ క్రియేటర్ గా వ్యవహరించగా, అవినాష్ అరుణ్ ధావేర్ దర్శకత్వం వహించారు.
జనవరిలో రెండో సీజన్...
తాజాగా 'పాతాళ్ లోక్' రెండో సీజన్ కు సంబంధించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జనవరి 17 నుంచి 'పాతాళ్ లోక్' సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు. ఈ మేరకు మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయగా, అందులో సగం మనిషి ముఖం, మరో సగం జంతువు కళేబరంతో జైదీప్ అహ్లావత్ కనిపిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీజన్ 2 లో ఓ సామాజిక సమస్యను ఆవిష్కరించబోతున్నారని రూమర్లు విన్పిస్తున్నాయి. ఈ సీజన్ లో తిలోత్తమ షోమే, నగేష్ కుకునూర్‌తో పాటు మరికొంత మంది కొత్త నటీనటులు యాక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ సీజన్ మొత్తం జైదీప్ పాత్ర చుట్టే తిరగబోతుందని అంటున్నారు. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ హిందీతో పాటు ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది.
'పాతాళ్ లోక్' సీజన్ 1 స్టోరీ ఏంటంటే...
ఒక ఛానల్ హెడ్ మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. దానిని అడ్డుకున్న పోలీస్ ఆఫీసర్ అనుమానితులను అరెస్ట్ చేసి, వారి నుంచి ఎలాంటి నిజాలను రాబట్టాడు? ఇన్వెసిగేషన్ లో బయటపడ్డ షాకింగ్ నిజాలు ఏంటి ? అనేది స్టోరీ. ఇప్పుడు రెండవ సీజన్లో కూడా ఇలాగే మరో కొత్త సామాజిక సమస్యతో ప్రేక్షకులను మేకర్స్ అలరించబోతున్నారని అంటున్నారు. 'పాతాళ్ లోక్' సీజన్ 2ను క్లీన్ స్లేట్ ఫిలింజ్ యునోయా ఫిల్మ్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై నిర్మించారు. కొత్త ఏడాది మొదట్లోనే ఈ మోస్ట్ అవైటింగ్ సిరీస్ ను చూడవచ్చు అంటూ మేకర్స్ ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.
Read Also : They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే