Breaking News Live Telugu Updates: టీడీపీ కేంద్ర కార్యాలయానికి బాలకృష్ణ, సీనియర్ నేతలతో చర్చలు

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు

ABP Desam Last Updated: 11 Sep 2023 07:31 PM
చంద్రబాబు కస్టడీ పిటిషన్ లో మరో ట్విస్ట్, కోర్టుకు రావాలని లాయర్లకు సమాచారం

చంద్రబాబు కస్టడీ పిటిషన్ లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు మంగళవారం మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుందని సమాచారం. అయితే అనూహ్యంగా ఇరుపక్షాల లాయర్లను కోర్టుకు హాజరు కావాలని సమాచారం అందించారు. దాంతో కస్టడీ పిటిషన్ పై మరోసారి ఉత్కంఠ నెలకొంది.

నేను భయపడను.. జగన్ ను వదిలిపెట్టను: నారా లోకేష్

లోకేష్ పీసీ @ రాజమండ్రి


టీడీపీ తల పెట్టిన బంద్ కు సహకరించిన ప్రజలకు, పవన్ కళ్యాణ్ అన్నకు, మంద కృష్ణ మాదిగ కు.. కమ్యూనిష్టు లకూ కృతజ్ఞతలు


జగన్ చేసిన అతి పెద్ద తప్పు చంద్రబాబు అరెస్ట్


పాముకు తలలో విషం.. జగన్ కు వళ్లంతా విషం


జగన్ కు అధికారం అంటే ఏమిటో తెలియదు


అధికారం అంటే ప్రజలకు మేలు చెయ్యడం.  ఉద్యోగాలు తేవడం...అభివృద్ధి చెయ్యడం

కానీ జగన్ దృష్టిలో అధికారం అంటే వేధింపులు...కక్ష తీర్చుకోవడం


జగన్ పై 38 కేసులు ఉన్నాయి..


బాబాయ్ హత్య కేసు...పింక్ డైమండ్ కేసు. . కోడి కత్తి కేసుల్లో ఎంత నిజముందో.  చంద్రబాబు పై పెట్టిన కేసులో కూడా అంతే నిజముంది 


ఈ కేసు వల్ల జగన్ ఎంత సైకో నో ప్రజలకు రుజువైంది


స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కు ఆమోదం తెలిపిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం లో సలహా దారులు గా ఉన్నారు. వారిని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదో జగన్ చెప్పాలి


ఇన్నాళ్లూ ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు అంటే ఒకటే అర్థం..ఈ అంశంలో తప్పు జరగలేదు.


ప్రభుత్వాన్ని ఒక్కటే ప్రశ్నిస్తున్నా..." స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ వల్ల చంద్రబాబుకు డబ్బులు ముట్టాయని అధారాలతో నిరూపించే దమ్ము ఉందా?"


CID అనేది కక్ష సాధింపు డిపార్ట్ మెంట్ గా మారిపోయింది


స్థానిక నేత ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ముఖ్యమంత్రి చిన రాజప్ప లపై కేసులు పెట్టారు. నాపై 20కి పైగా కేసులు పెట్టారు.హత్యాయత్నం కేసు కూడా పెట్టారు.


నేను భయపడను.. జగన్ ను వదిలిపెట్టను.


సొంత బాబాయ్ ను చంపిన అవినాష్ బయట దర్జాగా తిరుగుతున్నాడు


లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తాం..ఇప్పుడు చూసింది ట్రైలర్ మాత్రమే అసలు పిక్చర్ ముందు ఉంది అని వైసీపీ నేతలు అంటున్నారు.నేను రాజమండ్రి లోనే ఉన్నాను బ్రదర్.. ఏం చేస్తారో చేసుకోండి .నేను సిద్ధంగానే ఉన్నాను



చంద్రబాబు పై విమర్శలు చేస్తున్న బొత్స వల్లే వోక్స్ వేగన్ సంస్థ మన రాష్ట్రానికి దక్కకుండా పోయింది కదా... ముందు ఆయన దానికి జవాబు చెప్పాలి.



ఈ కేసు వెనక ఎవరున్నారో నాకు తెలియదు.. కేంద్రానికి తెలియ కుండానే ఈ అరెస్ట్ జరింగిందో ఏమో నాకు తెలియదు...బీజేపీ మిత్రులే దీనికి సమాధానం చెప్పాలి.

టీడీపీ కేంద్ర కార్యాలయానికి బాలకృష్ణ, సీనియర్ నేతలతో చర్చలు

అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబు, బెయిల్ విషయాలపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణ పై సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు.

చంద్రబాబుకు ప్రాణ హాని! జైల్లో ఉంచడం సరికాదని సిద్దార్థ్ లూథ్రా వాదనలు

విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందని సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా సంచలన ఆరోపణలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రాణ హాని ఉందని, ఆయనను జైల్లో ఉంచడం సరికాదని కోర్టులో ప్రస్తావించారు. హౌస్ రిమాండ్ అనేది ఇవ్వాలని, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనల్లో భాగంగా.. గతంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తావించారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సైతం వాదనలు జరగనున్నాయి. 

కుటుంబసభ్యులతో చంద్రబాబు ములాఖత్ రేపటికి వాయిదా

కుటుంబసభ్యులతో చంద్రబాబు రేపు ( సెప్టెంబర్ 12న) ములాఖత్ కానున్నారు. నేడు చంద్రబాబు తన కుటుంబసభ్యులను కలవాల్సి ఉండగా.. రేపటికి వాయిదా వేశారు. మరోవైపు ఏపీ సీఐడీ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. 

చంద్రబాబుపై మరో పిటిషన్ వేసిన ఏపీ సీఐడీ- ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్‌

ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో పిటిషన్ వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ వేసింది. చంద్రబాబును విచారించాలని కోరింది.

13, 14  తేదీల్లో ఢిల్లీకి  ఏపి  సీఎం  జగన్- మోడీ, అమిత్‌షాతో సమావేశం

ఈ  నెల  13   14  తేదీల్లో  ఢిల్లీకి  ఏపి  సీఎం  జగన్


ప్రధాని  మోడీ , కేంద్ర  హోమ్  మంత్రి  అమిత్  షా  తో  భేటీ  అయ్యే  అవకాశం


ఈ  నెల  18  నుంచి  జరిగే  పార్లమెంట్  సెషన్  లో  కీలక  బిల్లులు


బిల్లులకు  వైసీపీ  మద్దతు  ప్రధానం


ఏపీ లో  చంద్రబాబు  అరెస్ట్  తాజా  పరిణామాలు, జమిలి  ఎన్నికలు  ఇతర  అంశాలు చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ రోజులు: అచ్చెన్న

వైసీపీ ఓడిపోతామని తెలిసి కావాలనే చంద్రబాబును అరెస్టు చేయించారు; అచ్చెన్న
ఇది అక్రమైన అరెస్టు: అచ్చెన్న
న్యాయం బతికి ఉందన్న ఆశతోనే ముందుకు వెళ్తున్నాం:అచ్చెన్న
నాలుగున్నర ఏళ్ల నుంచి ఇదిగో అదిగో అని బెదిరిస్తూ వచ్చారు:అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు కనిపిస్తున్నాయి:అచ్చెన్న

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నివాసం వద్ద ఉద్రిక్తత

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నివాసం వద్ద ఉద్రిక్తత


వందల కుటుంబాలను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని కోటంరెడ్డి ఆందోళన


తనను స్టేషన్లో ఉంచాలని లేదా లాకప్‌లో పెట్టుకోవాలని బయటకు వెళ్లే ప్రయత్నం చేసిన రూరల్ ఎమ్మెల్యే


అడ్డుకున్న పోలీసులు


నగర డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డితో కోటం రెడ్డి  వాగ్వాదం

కళ్యాణదుర్గంలో టిడిపి ఆందోళనలు- లీడర్లను అరెస్టు చేసిన పోలీసులు

అనంతపురము జిల్లా కళ్యాణదుర్గంలో టిడిపి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అర్టీసి బస్సులను ఆపేసి రోడ్డుపై బైఠాయించారు నేతలు. రాస్తారోకోలో టిడిపి ఇన్ చార్జ్ ఉమా మహేశ్వర నాయుడు పాల్గొన్నారు. వారిని పోలీసులు అడ్డకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. టిడిపి నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు పోలీసులు.

Background

చంద్రబాబు అరెస్టు, రిమాండుకు నిరసనగా ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. రాజకీయ కక్ష సాధింపుతో చేసిన అరెస్టును బంద్ ద్వారా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కేందుకే ఇలా చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కాగా అత్యవసర సేవల్లోని వారు మినహా మిగతా వర్గాలన్నీ బంద్‌కు సహకరించాలని నేతల కోరారు. 


పలు చోట్ల రోడ్లపైకి టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మసీద్ సెంటర్లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. కందుకూరులోని పామూరురోడ్డు జంక్షన్‌లో టీడీపీ శ్రేణులు మానవహారంగా నిలబడి ఆందోళన చేపట్టాయి. సీఎం డౌన్ డౌన్, సైకో దిగిపోవాలి, చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నేతలు ఆందోళనలు చేపట్టారు.


చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఐడీ వాదనలతోనే కోర్టు ఏకీభవిస్తూ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 2 వారాల రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. 


జిల్లా ఎస్పీలకు కీలక ఆదేశాలు
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు గుంపుగా ఉండకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 


టీడీపీ ఇచ్చిన బంద్ కు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా టీడీపీ బంద్ కు పిలుపునివ్వగా, బీజేపీ మద్దతు తెలిపినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీడీపీ బంద్ కు మద్దతిస్తున్నట్లు బీజేపీ లెటర్ హెడ్ పై తాను మద్దతు తెలిపినట్లు ఓ ఫేక్ లెటర్ వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఫేక్ లెటర్ సర్క్యులేట్ కు కారకు పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులుకు ఫిర్యాదు చేస్తామన్నారు దగ్గుబాటి పురందేశ్వరి.


మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, టీడీపీ బంద్ కు పిలుపునివ్వగా బీజేపీ సంఘీభావం తెలిపినట్లు ఆ లెటర్ హెడ్ లో ఉంది. టీడీపీ నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ధర్నాలకు బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతోంది. కనుక బీజేపీ శ్రేణులు ధర్నాలలో పాల్గొని చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని మనవి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరుతో లెటర్ హెడ్ వాట్సాప్ లో వైరల్ గా మారడంతో ఆమె స్పందించారు. బీజేపీ ఎలాంటి ప్రకటన చేయలేదని, జరుగున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.


పలు చోట్ల రోడ్లపైకి టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యాయి. పలు చోట్ల ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మసీద్ సెంటర్లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. కందుకూరులోని పామూరురోడ్డు జంక్షన్‌లో టీడీపీ శ్రేణులు మానవహారంగా నిలబడి ఆందోళన చేపట్టాయి. సీఎం డౌన్ డౌన్, సైకో దిగిపోవాలి, చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో నేతలు ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని, వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చంద్రబాబును కేసులలో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.