Breaking News Telugu Live Updates: Kamareddy News: హాస్టల్‍లో  విద్యార్థి మృతి.. వార్డెన్ సస్పెండ్

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 10 Sep 2022 01:55 PM
గ‌ద్వాల జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు దుర్మరణం, రొకరి పరిస్థితి విషమం

జోగులాంబ గ‌ద్వాల జిల్లా ప‌రిధిలోని ఎర్రవ‌ల్లి చౌర‌స్తా స‌మీపంలోని గోశాల వ‌ద్ద శ‌నివారం ఉద‌యం ఘోర రోడ్డుప్రమాదం జ‌రిగింది. డీసీఎంను ఓవ‌ర్ టేక్ చేయబోయిన బైక్ అదుపుతప్పి, ఎదురుగా వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడిక‌క్కడే మృతి చెంద‌గా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

జీఎస్టీ నుండి అన్ని అంశాల్లో కేసీఆర్ అండగా నిలిచిండు: పొన్నం ప్రభాకర్

కేసీఆర్ ముచ్చట.. అక్బర్ బీర్బల్ కథలా వుంది.
వంకాయ కూర బాగుందంటే బాగుందని భజన బ్యాచ్ అంటున్నారు 
కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన భజన మండలి ఆహా హోహో అంటున్నారు 
బిజెపికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే 
మొదటి నుండి బిజెపికి మద్దతిచ్చిన పార్టీ టీఆరెస్ 
జీఎస్టీ నుండి అన్ని అంశాల్లో కేసీఆర్ అండగా నిలిచిండు 
80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఒక్కసారి మీ పాలన వెనక్కి తిరిగి చూసుకోండి 
ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదు 
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఏమైంది.
ఇక ఉద్యోగుల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు 
తెలంగాణ పబ్లిక్ కు ఇచ్చిన హామీలు అమలు చేసి దేశ రాజకీయాల గురించి మాట్లాడు 
త్రీడి షో తప్పా ఏమి లేదు 
కాంగ్రెస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినం 
ఇప్పుడు ఒక్కటి అమలు కావడం లేదు 
కొత్త బిచ్చగాళ్లుగా టీఆరెస్, బిజెపి నేతలు కొట్లాడుకుంటున్నారు 
రేషన్ షాపుల వద్ద, మరుగు దొడ్ల వద్ద మా ఫోటోలు లేవంటే మా ఫోటోలు లేవని కొట్లాడుకుంటున్నారు.
జాతీయ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి
కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు 
మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 
ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో మా సీటు కాదు 
మునుగోడు మా సీటు.. మేము దక్కించుకుంటాం 
నేను కూడా ప్రచారానికి వెళ్తా 
నాకు సీనియార్టీ వచ్చినప్పుడు గాంధీ భవన్ మీటింగ్ లో, ప్రియాంక గాంధీ వద్ద మీటింగ్ లో హాజరవుతా 
అప్పటి వరకు నా నియోజకవర్గంలో నే ఉంటా..

Kamareddy News: హాస్టల్‍లో  విద్యార్థి మృతి.. వార్డెన్ సస్పెండ్

కామారెడ్డి జిల్లాలోని బిర్కూర్ బీసీ బాలుర హాస్టల్ లో సాయిరాజ్ అనే విద్యార్థి చనిపోయాడు. దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ బిర్కూర్ బీసీ హాస్టల్ లో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే అర్థరాత్రి ఒంటి గంట సమయంలో సాయిరాజ్ కు వాంతులు అవడంతో హాస్పిటల్ కు తరలించారు. శనివారం ఉదయం 5గంటలకు సాయిరాజ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పాము కరిచిందని హాస్టల్ సిబ్బంది తెలిపారని సాయిరాజ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతిపై వివిధ రకాల కారణాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ హాస్టల్ కు చేరుకున్న సాయిరాజ్ కుటుంబ సభ్యులు.... హాస్టల్ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బీసీ హాస్టల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇక విద్యార్థి మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.


బిర్కూర్ బీసీ బాలుర వసతిగృహంలో విద్యార్థి మృతి చెందడంతో వార్డెన్ సందీప్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్ తెలిపారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థి మృతిచెందినందున అతడిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. విద్యార్థి సాయి రాజ్ మృతిపై ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Breaking News Telugu Live Updates: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుపతి : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తమిళనాడు మాజీ సీఎం పళని స్వామి, తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వెస్ట్ గోదావరి ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు,చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

పీఎస్‌లో నిందితుడు మృతి.. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

శ్రీకాకుళం జిల్లాలోని భూర్జ పోలీస్ స్టేషన్లో నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా ఆ స్టేషన్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల మెడకు చుట్టుకుంది. ఈనెల 6వ తేదీన రాత్రి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఆ స్టేషన్ ఎస్ఐ మహ్మద్ యాసిన్‌, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ జీఆర్.రాధిక ఉత్తర్వులు జారీ చేశారు.


తన భార్య ఆత్మహత్య కేసులో విచారణకు తీసుకువచ్చిన నిందితుడు మురపాక మహేష్ అనుమానాస్పదంగా చనిపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. మహేశ్ మృతికి సంబంధించి ఎస్ఐ మహమ్మద్ యాసిస్, రైటర్ పి.లక్ష్మణరావు (హెచ్ సీ), మహిళా కానిస్టేబుల్ రాజేశ్వరమ్మను సస్పెండ్ చేశారు.

గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి వర్సిటీ వీసీ స్టెప్పులు

నిజామాబాద్ లోని తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గణేష్ నిమజ్జనం తర్వాత.. గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి ఆయన నృత్యాలు చేశారు. వీసీ రవీందర్ గుప్తా డబ్బులు ఎగురవేస్తూ డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకుండా వీసీతోపాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో వీసీ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసే రవీందర్ గుప్తా గత రెండు రోజుల క్రితం ఓ మహిళా ప్రొఫెసర్ ను దుర్భాషలాడి మరో వివాదానికి తెర తీశారు.


తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్​ అడ్రస్ గా మారింది. కొత్త వీసీ వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీలో నిత్యం ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంది. ఏడు నెలల కింద నియమించిన రిజిస్ట్రార్ ను తొలగించడంతో, మరోసారి ఆ వర్సిటీ వార్తల్లో నిలిచింది. అనేక ఆరోపణలు వస్తున్నా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అప్పట్లో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

Aaron Finch Retirment: ఆస్ట్రేలియా​కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక నిర్ణయం

ఆస్ట్రేలియా​కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్​ఫార్మాట్‌కు రిటైర్మెంట్​ప్రకటించాడు. పొట్టి ఫార్మాట్ లో కొనసాగుతానని ఈ ఆసీస్ క్రికెటర్ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ తో ఆదివారం జరగనున్న వన్డే ఆరో ఫించ్ అంతర్జాతీయ కెరీర్ లో చివరి వన్డే కానుంది. ఈ క్రమంలో వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ఫించ్ ప్రకటించి తన అభిమానులకు షాకిచ్చాడు. వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపాడు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం - కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ లోని సక్కర్దార వంతెన పై వేగంగా వస్తున్న ఓ కారు అదే దారిలో వస్తున్న వాహనాలపైకి దుసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Breaking News Telugu Live Updates: సస్పెన్షన్ కు గురైన ఉద్యోగి అనారోగ్యంతో మృతి

ఉండవల్లి ఎమ్మార్వో ఆఫీసులో గతంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన సాయిబాబా(56) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన 40 రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడగా, విధులకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు.

Background

హైదరాబాద్‌లోని ఎంజే మార్కెట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దాదాపుగా భౌతిక దూకుడినే పరిస్థితి తలెత్తిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అది కూడా Z+ సెక్యూరిటీ ఉండే వ్యక్తికి సెక్యూరిటీ లోపం తలెత్తిందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిపై త్వరలోనే రాతపూర్వకంగా వివరణ ఇవ్వనున్నారు. గతంలోనూ అసోం ప్రభుత్వం, సీఆర్‌పీఎఫ్‌ సైతం ఇదే విషయమై తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. హైదరాబాద్‌ ఎంజే మార్కెట్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనం వేదికపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రసంగించేందుకు సిద్ధం కాగా, టీఆర్ఎస్ కార్యకర్త మైక్‌ లాక్కునేందుకు ప్రయత్నించడం ఉద్రికత్తలకు దారితీసింది. 


తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. ఈ అల్పపీడనం క్రమంగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరానికి చేరుకుని మరికొన్ని గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 


తెలంగాణలో వర్షాలు 
తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేడు (సెప్టెంబర్ 10న) నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సెప్టెంబర్ 10న ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో విస్తారంగా వర్షాలు పడతాయి. మిగతా చోట్ల చల్లని గాలులు వేగంగా వీస్తాయి. భారీ వర్ష సూచనతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. 
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, ప్రకాశం క్రిష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.