Just In





Andhra Pradesh, Telangana Latest News : సైకిల్ ట్యూబ్ వాల్ పిన్ ఒకరు, పల్లి గింజ మరొకరు మింగేశారు- చిన్న పిల్లలతో జాగ్రత్త
Andhra Pradesh, Telangana Latest News :పల్లీ గింజ గొంతులో ఇరుక్కొని తెలంగాణలోఓ బాలుడు మృతి చెందాడు. ఏపీలో ఓ బాలుడి గొంతులో ఇరుక్కున్న సైకిల్ ట్యూబ్ వాల్‌ను వైద్యులు తొలగించారు.

Andhra Pradesh, Telangana Latest News :మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా. అయితే ఈ వార్త మీ లాంటి వాళ్ల కోసమే. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే రెండు ఘటనలు ఏపీ తెలంగాణలో జరిగాయి. ఒకచోట పల్లీ గింజను బాలుడు మింగేసి మృత్యువాత పడితే మరో ప్రాంతంలో సైకిల్ ట్యూబ్ వాల్‌పిన్ మింగేశాడో బాలుడు. అందుకే పిల్లలు అడుకుంటున్నప్పుడు ఓ కంట కనిపెట్టాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ బాలుడి గొంతులో పల్లీ గింజ ఇరుక్కుంది. గూడూరు మండలం నాయకపల్లికి చెందిన అక్షయ్ అనే ఏడాదిన్నర బాలుడు పల్లీ గింజను మింగేశాడు. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. పల్లీ ఇరుక్కోవడంతో బాలుడు ఇబ్బంది పడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు మృతి చెందాడు. దీంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది.
Also Read: అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. రాజాంలో ఏడాది బాలుడు ఇంటి వద్ద ఉన్న సైకిల్ ట్యూబ్‌తో ఆడుకున్నాడు. ఆడుకుంటూ దానికి ఉన్న వాల్ పిన్ కొరికి మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో విపరీతంగా ఎడవడం మొదలు పెట్టారు. వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి బాలుడిని తీసుకెళ్లారు తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న వైద్యులు వెంటనే బాలుడికి ఎండోస్కోపి చేసి వాల్ పిన్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే జాగ్రత్తగా దాన్ని తొలగించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అందుకే చిన్నారులకు ఆట వస్తువులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. చిన్న చిన్న బాల్స్ లాంటివి, లేదా షార్ప్‌గా ఉన్నవి కానీ ఎలక్ట్రిక్ వస్తువులు, లేదా రంగురంగుల ఆట వస్తువులు అసలు ఇవ్వొద్దని హెచ్చరించారు.
Also Read:తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధార్ అథెంటికేషన్
హిందూపురంలో ప్రమాదవశాత్తు చెరువులో పడిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అయాన్ (12), రిహాన్(14) స్నానం కోసం చెరువుకు వెళ్లారు. ఈత రాకపోవడంతో ఇద్దరూ మృతిచెందారు. వారిని రక్షించేందుకు స్థానికుల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.