Gold ATM : బంగారం ధరలు కొంత కాలంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గింది లేదు. ఇప్పటికే లక్ష దాటేసింది. ఇది మరింత పరుగులు తీస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న బంగారం మరింత జాగ్రత్తగా దాచుకున్న వాళ్లు ఉన్నారు. ఉన్న బంగారాన్ని అమ్మేసి వాటితో అవసరాలు తీసుకున్న వాళ్లు కూడా ఉన్నారు.
బంగారం కొనాలంటే క్షణాల్లో వెళ్లి నచ్చిన ఆభరణాలనో, బిస్కెట్‌లను కొనుక్కోవచ్చు. కానీ అమ్మాలంటే మాత్రం గంటల సమయం వృథా అవుతుంది. కానీ చైనాలో మాత్రం అరగంటలోనే బంగారం అమ్మే ప్రక్రియ పూర్తి చేసి డబ్బులను ఖాతాాల్లో డిపాజిట్ చేస్తోంది. అందుకే ఆ గోల్డ్ ఏటీఎం చుట్టూ భారీగా జనం బారులు తీరుతున్నారు.
అర గంటలో ఖాతాలో డబ్బులు
చైనాలో గోల్డ్ ATM అందుబాటులోకి వచ్చింది. మీరు బంగారాన్ని డిపాజిట్ చేస్తే దాన్ని నిమిషాల వ్యవధిలో కరిగించేసి తనిఖీ చేస్తుంది. అనంతరం డబ్బులను మీకు ఇస్తుంది. చైనాలో ఏర్పాటు చేసిన ఈ గోల్డ్ ATM షాంఘై ప్రజల దృష్టిని మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గోల్డ్ ATM బంగారాన్ని కరిగించి దాని నాణ్యతను తనిఖీ చేసి, బరువును కొలిచి, తర్వాత ముప్పై నిమిషాల్లో డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.
ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు
ఈ గోల్డ్ ATM చైనాకు చెందిన కింగ్స్ హుడ్ గ్రూప్ నిర్వహిస్తోంది. ఇది 3 గ్రాములకుపైగా బరువును, కనీసం శాతం నాణ్యతతో ఉన్న బంగారాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఈ గోల్డ్ ATM నుంచి బంగారం వేసి డబ్బులు తీసుకునేందుకు ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేదు. ఏదైనా ID కూడా అవసరం లేదు.
గోల్డ్ ATM వద్ద భారీ క్యూలుబంగారం ధరలు పెరుగుతున్న కారణంగా ఈ గోల్డ్ ATM వద్ద ప్రజలు భారీగా క్యూ కట్టారు. ఈ యంత్రానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని ఉపయోగించడానికి ప్రజలు ముందుగానే స్లాట్‌లు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. మే నెల వరకు ఈ గోల్డ్ మెషిన్‌కు అపాయింట్‌మెంట్లు బుక్ అయ్యాయి అంటే ఎంతలా రష్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
చైనా టైమ్స్ డాట్ కాం నివేదిక ప్రకారం, ప్రయోగం సమయంలో 40 గ్రాముల బంగారం ఈ ఏటీఎంలో వేశారు. అర గంటలో 4.2 లక్షల రూపాయలు జమ చేసిన వారి ఖాతాలో వేసేసింది. RPG ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన హర్ష్ గోయంకా ఈ గోల్డ్ ఏటీఎంపై సోషల్ మీడియా Xలో రాశారు "షాంఘైలో ATM గోల్డ్: మీ ఆభరణాలను వేస్తే. దాని నాణ్యత తనిఖీ చేసి, కరిగిస్తుంది. దాని విలువను అంచనా వేస్తుంది. వెంటనే మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది."
భారత్‌లోకి వస్తే అప్పులు ఇచ్చే వాళ్లకు ముప్పే
ఇలాంటి భారతదేశంలోకి వస్తే అప్పులు ఇచ్చే వాళ్లకు పెను ముప్పుగా మారుతుందని అన్నారు. సంప్రదాయ బంగారం వ్యాపారానికి బదులుగా, పారదర్శకతతో కూడిన, దోపిడీ లేని కొత్త వ్యాపార నమూనా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.