UPSC Civil Services final results released: యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1009 మందిని సర్వీసులకు ఎంపిక చేశారు. టాప్ టెన్‌లో తెలుగు వాళ్లెవరూ లేరు. పదకొండో ర్యాంక్‌లో ఎట్టబోయిన సాయి శివాని ఉన్నారు.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) మరియు ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ 'A' మరియు గ్రూప్ 'B' లకు మొత్తం 1,009 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 335 మంది అభ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందినవారు, ఇందులో 10 మంది PWBD-1, 5 మంది PWBD-2, 11 మంది PWBD-3 మరియు 5 మంది PWBD-5 అభ్యర్థులు ఉన్నారు.
109 మంది అభ్యర్థులు EWS (ఆర్థికంగా బలహీన విభాగం) వర్గానికి చెందినవారు, వీరిలో 1 PwBD-1 మరియు 1 PwBD-2 ఉన్నారు. ఈ వర్గంలో PWBD-3 లేదా PWBD-5 కింద అభ్యర్థి లేరు.
318 మంది అభ్యర్థులు OBC వర్గానికి చెందినవారు, ఇందులో 2 PWBD-1, 2 PWBD-2, 3 PWBD-3 మరియు 3 PWBD-5 అభ్యర్థులు ఉన్నారు.
160 మంది అభ్యర్థులు SC (షెడ్యూల్డ్ కులం) వర్గానికి చెందినవారు, ఇందులో PwBD-1 లేదా PwBD-2 లేవు, కానీ 2 PwBD-3 1 PwBD-5 అభ్యర్థులు ఉన్నారు.
87 మంది అభ్యర్థులు ST (షెడ్యూల్డ్ తెగ) వర్గానికి చెందినవారు, ఇందులో PwBD-1 లేదు, PwBD-2 లేదు, 2 PwBD-3 మరియు PwBD-5 అభ్యర్థులు లేరు.
ర్యాంకులు సాధించిన పలువురు తమ సంతోషాన్నిసోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
నెబంర్ వన్ ర్యాంకర్ శక్తి దూబే కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి పీజీ పూర్తి చేసి 2018 నుంచి సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.
యూపీఎస్సీ సక్సెస్ స్టోరీలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.