Telangana Inter 1st Year Results 2025: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత రెగ్యూలర్ తో పాటు వొకేషనల్ విద్యార్థుల ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫస్టియర్ ఫలితాలతో పాటు సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో, అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. 

 

ఈ ఏడాది మొత్తం 9,97,017 మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారని భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ 66.89 శాతం పాస్ కాగా, సెకండియర్ లో 71.37 శాతం విద్యార్థులు పాసయ్యారు. ఫస్టియర్ 4,88,432 విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ లో బాలికలు 73.83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 57.83 శాతం బాలురు పాసయ్యారు..

 

https://telugu.abplive.com//amp

https://tgbie.cgg.gov.in/ 

 

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో వీరిలో 4,80,415 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎగ్జామ్ పూర్తయిన నెలరోజుల్లోపే తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ ఫలితాలను వెల్లడించింది. ఇటీవల ఏపీలో మూడు వారాలకే ఇంటర్ పలితాలు రిలీజ్ చేయడం తెలిసిందే.