Vehicle horns with musical instruments: కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వాహనాల హారన్‌లను సాంప్రదాయ భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాలతో మార్చాలనే ప్రతిపాదన ఉందని ప్రకటించారు. దీని వల్ల శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం తో పాటు రోడ్లపై ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని ఆయన అంటున్నారు. వాహనాల హారన్‌లు బాక్సురి, తబలా, వయొలిన్, హార్మోనియం, నోటి ఆర్గాన్ వంటి భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాలను పోలి ఉండాలని చెబుతున్నారు. ఈ శబ్దాలు ఆహ్లాదకరంగా ఉండి, సాంప్రదాయ హారన్‌ల గట్టి శబ్దం వల్ల కలిగే శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తాయనేది ఆయన నిశ్చితాభిప్రాయం. ఈ చొరవ రోడ్లపై ఒత్తిడిని తగ్గించి, మరింత ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని గడ్కరీ భావిస్తున్నారు.
రవాణా రంగం దేశంలో 40 వాయు కాలుష్యానికి కారణమవుతోంది.ని, శబ్ద కాలుష్యం కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మ్యూజికల్ హార్న్ ప్రతిపాదన శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు నగర ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుందని గడ్కరీ భావిస్తున్నారు.
ఈ ఆలోచనను అమలు చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకురావాలని గడ్కరీ ప్లాన్ చేస్తున్నారు. వాహన తయారీ సంస్థలు తమ వాహనాల్లో ఈ సంగీత హారన్‌లను అమర్చేలా చట్టంలో నిబంధనలు పెడతారు. గడ్కరీ అవుటాఫ్ లైన్ ఆలోచిస్తున్నారు. అంబులెన్స్, పోలీసు వాహనాల సైరన్లను కూడా ఆహ్లాదకరమైన శబ్దాలతో మార్చాలని ఆలోచిస్తున్నారు. ఆకాశవాణి లాంటి ఆహ్లాదకర ట్యూన్‌ను అంబులెన్స్ సైరన్‌గా ఉపయోగించే ఆలోచన ఉందని ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉంటుందని ఆయన అంటున్నారు.
ఇప్పుడే గడ్కరీ ఈ విషయం చెప్పడం లేదు. ఈ ఆలోచన మొదట 2021లో గడ్కరీ ప్రస్తావించారు మళ్లీ.. ఇటీవల ో కార్యక్రమంలో అన్నారు.ఈ నిర్ణయానికి కారణం కూడా గడ్కరీ చెప్పారు. నాగ్‌పూర్‌లో తన నివాసంలో ఉదయం ప్రాణాయామం చేస్తున్నప్పుడు వాహన హారన్‌ల శబ్దం గడ్కరీని ఇబ్బంది పెట్టిందట. అదే సంగీతం వినిపిస్తే ఎంత బాగుండేదో అన్న ఆలోచన రావడంతో.. చట్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ సాధ్యమవుతుందా లేదా అన్నదానిపై చాలా సందేహాలు ఉన్నాయి. కొొంత మంది మనం ఎటు పోతున్నామని విమర్శలు గుప్పిస్తున్నారు.