Terror attack again in Kashmir: జమ్మూ కశ్మీర్ లో కొంత కాలంగా టెర్రర్ ఎటాక్స్ లేవు. టూరిస్టులంతా హాయిగా వెళ్లి కశ్మీర్ ను చూసి వస్తున్నారు. అయితే హఠాత్తుగా పెహల్గాం జిల్లాలో టూరిస్టులపై ఉగ్రదాడి జరిగింది. భయం లేకుండా పెహల్గాంలోని ప్రకృతిని ఆస్వాదిస్తున్న పర్యాటకులపై తూటాలు పేల్చారు. పది మంది పర్యాటకులకు గాయాలయ్యాయి. ఒకరు చనిపోయారు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ప్రారంభించాయి.
ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు జరగకపోవడంతో టూరిస్టులు పెహల్గాంకు ఎక్కువగా వస్తున్నారు. ఈ కారణంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో లిడ్డర్ నది ఒడ్డున హెహల్గాం ఉంటుంది. హిమాలయాలలో 7,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంపై టూరిస్టులుప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. సహజ సౌందర్యం, సతత హరిత అడవులు, మంచు కొండలు, పచ్చని లోయలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది అమర్‌నాథ్ యాత్రకు ప్రారంభ స్థానం కూడా.
కశ్మీర్‌ను "పాకిస్తాన్ జీవనాడి" పాకిస్తాన్ జనరల్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఈ దాడి జరగడంతో పాకిస్తాన్ వైపు నుంచే కుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్‌పై పాకిస్తాన్ దీర్ఘకాల వైఖరి అలాగే ఉందని.. మా కశ్మీరీ సోదరులను వారి వీరోచిత పోరాటంలో వదిలిపెట్టబోమని పాకిస్తాన్ జనరల్ స్పష్టం చేశారు. మేము ప్రతి విధంగా హిందువులకు భిన్నమని ... మా మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవని చెప్పుకొచ్చారు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మునీర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.