YouTubeలో వ్యూస్ రావాలంటే.. ఎంతో క్రియేటివ్‌గా ఆలోచించాలి. ఎప్పటికప్పుడు సరికొత్త వీడియోలను పోస్ట్ చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఎప్పుడూ రొటీన్ వీడియోలు పెడితే వ్యూవర్స్‌కు ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే.. యూట్యూబర్స్ ఎప్పటికప్పుడు తాజాగా కాన్సెప్ట్‌లతో ముందుకొస్తుంటారు. ఒక్కోసారి ఏమీ దొరకనప్పుడు.. కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. తమ వీడియోలను వైరల్ చేసి ఫేమస్ కావాలని అనుకుంటారు. అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్ ఇదే పని చేశాడు. ఏకంగా తాను ప్రయాణిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూల్చేసి.. ఆ వీడియోను యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేశాడు. 


కాలిఫోర్నియాకు చెందిన ట్రెవర్ జాకబ్ అనే మాజీ ఒలింపిక్ స్నో‌బోర్డర్, యూట్యూబర్‌కు సాహసాలంటే చాలా ఇష్టం. ఈ సందర్భంగా అతడు తన అడ్వాంచర్ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ నెటిజనులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు అతడి యూట్యూబ్ చానల్‌‌ను 1.30 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇటీవల అతడు ‘I Crashed My Plane’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ఇప్పటివరకు సుమారు 1 మిలియన్ మందికి పైగానే చూశారు. 


ఈ వీడియో కోసం అతడు Taylorcraft BL64 ఎయిర్‌క్రాఫ్ట్‌ను కొనుగోలు చేశాడు. అనంతరం అతడు శాంటా బార్బరా (Santa Barbara) నుంచి కాలిఫోర్నియాలోని లాస్ పాద్రేస్ నేషనల్ ఫారెస్ట్ (Los Padres National Forest) మీదుగా ముముత్ (Mammoth)కు బయల్దేరాడు. పర్వత ప్రాంతం మీదుగా వెళ్తుండగా.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత.. విమానం నుంచి పారాచూట్ సాయంతో దూకేశాడు. అదంతా అతడు వీడియోలో రికార్డ్ చేశాడు. ఈ దృశ్యాలను రికార్డు చేయడం కోసం విమానానికి కూడా కెమేరాలు అమర్చాడు. పైలట్ లేకుండా ఆ విమానం కొంత దూరం ప్రయాణించింది. ఆ తర్వాత కొండను ఢీకొట్టి కూలిపోయింది. ఆ తర్వాత జాకబ్.. విమానం కూలిన చోటుకు వెళ్లి.. కెమేరాలు తీసుకున్నాడు. ఆ తర్వాత కొండల్లో నడుస్తూ.. సాయం కోసం ఎదురు చూశాడు. చీకటి పడిన తర్వాత అతడికి లక్కీగా సమీపంలోని ఓ రోడ్డు మీద కారు వెళ్లడం కనిపించింది. దీంతో అతడు కారును ఆపి అడవి నుంచి బటపడ్డాడు. 


అయితే, విమానం కూలిపోవడం.. అతడు అడవిలో చిక్కుకుపోవడం పెద్ద డ్రామా అని నెటిజనులు విమర్శించడం మొదలుపెట్టారు. అతడు ప్లాన్ ప్రకారమే విమానం కూల్చేశాడని అంటున్నారు. యూట్యూబ్ వ్యూస్ కోసమే అతడు ఈ పని చేశాడంటూ తిట్టిపోశారు. అతడి మహా నటనకు ఆస్కార్ ఇచ్చినే తక్కువ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే.. ఆధారాలతో సహా అతడి డ్రామను బయటపెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి జాకబ్ ఎప్పుడూ.. వైట్ అండ్ రెడ్ కలర్‌లో ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌నే వాడతాడు. కానీ, కూలినపోయిన వీడియోలో వాడినది దాని కంటే చిన్నదైన ఎయిర్‌క్రాఫ్ట్. దాన్ని కూల్చేయాలనే ఉద్దేశంతోనే అతడు దాన్ని కొనుగోలు చేసి ఉంటాడని భావిస్తున్నారు. 


ఈ విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ(Federal Aviation Authority-FAA) సీరియస్‌గా తీసుకుంది. విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోడానికి ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ ఘటనపై జాకప్ స్పందిస్తూ.. ‘‘విమానంలో అకస్మాత్తుగా పవర్ ఆగిపోయింది. మళ్లీ స్టార్ట్ కాలేదు. ప్రమాదాన్ని గుర్తించి బయటకు దూకేసి ప్రాణాలు రక్షించుకున్నా. కొన్ని గంటల సేపు అడవిలో నడిచిన తర్వాత.. ఓ రైతు నన్ను ఆదుకున్నాడు’’ అని తెలిపాడు. అయితే, విచారణ పూర్తయ్యే వరకు జాకబ్‌ పైలట్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసే అవకాశం ఉంది. తప్పు రుజువైతే శిక్షతోపాటు మరెప్పుడు విమానాలు నడపకుండా బ్యాన్ విధించవచ్చని స్థానిక మీడియా పేర్కొంది. 



ఇవి కూడా చదవండి: 


ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
ఈ దేశంలో గుడ్లను మూత్రంలో ఉడికించి తింటారు.. ఇందుకో కారణం ఉంది!
సరసాలతో సంపాదన.. అమ్మాయిలతో ‘పులిహోర’ కలపడమే ఇతడి ఉద్యోగం
కోవిడ్ వ్యాక్సిన్‌ - బూస్టర్ డోస్‌‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్?


వ్యాక్సిన్ వద్దంటూ.. చెట్టెక్కి కూర్చున్నాడు, వీడియో వైరల్
‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం