కోవిడ్-19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం ఎంత ముఖ్యమో తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వైరస్‌ను కొంతవరకు ఎదుర్కోవచ్చు. లక్షణాలను కంట్రోల్ చేయొచ్చు. ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే కోలుకొనే అవకాశాలు కూడా పెరుగుతాయి. కానీ, చాలామంది సైడ్ ఎఫెక్టులకు భయపడి చాలామంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. దానివల్ల వారు వైరస్‌కు గురైతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వారి వల్ల ఇతరులు కూడా వైరస్‌కు గురవ్వుతారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి.. ఊరు-వాడా తిరుగుతూ మరీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా యూపీలోని బల్లియా జిల్లాలో ఓ చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. వ్యాక్సిన్‌కు భయపడిన ఓ వ్యక్తి చెట్టు మీదకు ఎక్కి కూర్చున్నాడు. ఎంతకీ కిందకి దిగనని మారం చేశాడు. 


వ్యాక్సినేషన్ కోసం వెళ్లిన టీమ్ ఆ ఊరిలో దాదాపు అందరికీ వ్యాక్సిన్లు వేశారు. అయితే, ఆ ఒక్క వ్యక్తి మాత్రమే వైద్య సిబ్బందికి చుక్కలు చూపించాడు. వ్యాక్సిన్‌కు భయపడి చెట్టెక్కి కూర్చోవడంతో అతడిని కింద దించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఓ అధికారి ఆగ్రహంతో చెట్టు మీద నుంచి కిందికి దిగు అని గద్దించారు. అతడు కిందకు దిగగానే.. వెంటనే అతడికి వ్యాక్సిన్ ఇవ్వండని ఆదేశించాడు. దీంతో సిబ్బంది అతడి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. రెయోటిలోని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అతుల్ దూబే మాట్లాడుతూ.. ‘‘వ్యాక్సిన్ తీసుకోనంటూ ఓ వ్యక్తి చెట్టు ఎక్కాడు. అతడిని ఒప్పించి వ్యాక్సిన్ ఇచ్చాం’’ అని పేర్కొన్నారు. మరో గ్రామంలో ఓ వ్యక్తి ఏకంగా అధికారితోనే కలబడ్డాడు. బలవంతంగా వ్యాక్సిన్ వేసేందుకు ప్రయత్నించగా అతడిని కిందపడేసి మరీ దొర్లించాడు. ఆ వీడియోలను ఇక్కడ చూడండి. 


వీడియో: 










Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు





 




 


Also read: రోజుకు రెండు స్పూనుల నువ్వులు... బరువు తగ్గించడమే కాదు, గుండెపోటునూ అడ్డుకుంటాయి



Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...


Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.