Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

‘పుష్ప’ సినిమా పోస్టర్‌ను కోవిడ్-19 అవగాహన కోసం వాడేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ. సోషల్ మీడియా పోస్ట్ వైరల్.

Continues below advertisement

కోవిడ్-19 కొత్త వేరియెంట్ ఒమిక్రాన్.. దావానంలా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అధికారులు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ #IndiaFightsCorona నినాదంతో ప్రజలు పాటించాల్సిన సేఫ్టీ విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తోంది. 

Continues below advertisement

అయితే, ప్రజలు సాధారణ పద్ధతిలో చెబితే అర్థం చేసుకోరనే ఉద్దేశంతో.. పాపులర్ సినిమాలు, మీమ్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ చిత్రం ‘పుష్ప’లోని ఓ పోస్టర్‌ను వాడేశారు. అందులో అల్లు అర్జున్ ఫొటోకు మాస్క్ పెట్టారు. ‘‘డేల్టా అయినా.. ఒమిక్రాన్ అయినా.. నేను మాస్క్ తీసేదేలే’’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో నెటిజనులు ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేసుకుంటున్నారు. ఈ ట్వీట్ మీకు కూడా నచ్చేస్తుంది.

 

Continues below advertisement
Sponsored Links by Taboola