అబ్బాయి: మా అక్క కొడుకు చందమామ కనిపిస్తేనే అన్నం తింటానని ఏడుస్తున్నాడు. 
అమ్మాయి: మరి నువ్వు ఏం చేశావ్. 
అబ్బాయి: వెంటనే నా మొబైల్‌లో ఓ ఫొటో చూపించా. 
అమ్మాయి: చందమామదా?
అబ్బాయి: కాదు.. నీదే. 
అమ్మాయి: అబ్బో!!


పై మెసేజ్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. సాధారణం దీన్ని ఇంగ్లీష్‌లో Flirting (ఫ్లర్టింగ్) అని అంటారు. మన తెలుగులో ప్రస్తుతం దీన్ని ‘పులిహోర’ కలపడం అని అంటున్నారు. అర్థం ఏదైనా.. ఇది ఒక కళ. అమ్మాయిలను మాటలతో పడగొట్టం అంత ఈజీ పని కాదు. అది అందరికీ సాధ్యం కాదు కూడా. అయితే, దీనివల్ల అమ్మాయి ప్రేమలో పడుతుందేమో గానీ, పైసా లాభం ఉండదు. కానీ, ఓ యువకుడు మాత్రం దీన్ని ఉద్యోగంగా మార్చుకున్నాడు. లక్షల్లో సంపాదిస్తున్నాడు. అదేంటీ.. అమ్మాయిలను మాటలతో పడగొట్టడం కూడా ఉద్యోగమేనా? కొంపదీసి మోసం చేయడం లేదు కదూ అనేగా మీ సందేహం? కానే.. కాదు.. కానీ, ఇది కొంచెం కష్టమైన పనే. అతడు చేసే పని మీకు నచ్చకపోవచ్చు కూడా. అక్కడి అబ్బాయిల్లో చాలామంది.. ఈ యువకుడిని ఆశ్రయించి భారీగా నగదు చెల్లిస్తున్నారు. 


అలబామా‌కు చెందిన జావియర్ లాంగ్ అనే 20 ఏళ్ల యువకుడు.. వారానికి కొన్ని వేల డాలర్లను సంపాదిస్తున్నాడట. ఇంతకీ అతడికి డబ్బులు ఇస్తున్నది ఎవరో కాదు అబ్బాయిలు. అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడం జావియర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇది అతడి ఫ్రెండ్స్‌కు కూడా తెలుసు. మొదట్లో వాళ్లు తమ క్రష్‌ను లైన్లో పెట్టేందుకు జావియర్ నుంచి సలహాలు తీసుకొనేవారు. అయితే, ఇప్పుడు జావియర్ ఆ స్టేజ్ దాటేశాడు. ఇప్పుడు అబ్బాయిలంతా.. నువ్వే స్వయంగా తమ ప్రియురాలిని మాటలతో పడేయాలంటూ జావియర్‌కు డబ్బులిస్తున్నారు. అదేంటీ అనుకుంటున్నారా?


కొంతమందికి తన పార్టనర్ తనను ఎంతగా లవ్ చేస్తుందో తెలుసుకోవలనే తపన ఉంటుంది. అలాగే, తన పార్టనర్‌ వేరే వ్యక్తుల మాటలకు పడిపోతుందా లేదా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. మొత్తానికి తమ ప్రియురాలి ప్రేమలోని విధేయత, నిజాయతీని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అది తెలుసుకోవడం కోసం వారు జావియర్‌కు వారి ప్రియురాలి ఫోన్ నెంబర్ ఇచ్చి.. పులిహోర కలపాలని, ఆ మాటలకు ఆమె ఎలా స్పందిస్తుందో తెలుసుకుని తమకు చెప్పాలని అతడిని అడుగుతున్నారు. ఇందుకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ఇలా జావియర్ వారానికి 2 వేల డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.1,48,581) వరకు సంపాదిస్తున్నాడు. 


జావియర్ మాట్లాడుతూ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మొదట్లో నేను దీన్ని ఫ్రీగానే చేసేవాడిని. కానీ, చాలామంది డబ్బులిస్తాం చేయాలని అడిగేవారు. డబ్బులు వస్తుంటే ఎందుకు మానుకోవాలనే ఉద్దేశంతో 10 డాలర్లతో ఈ పని మొదలుపెట్టాను. ఇక నేను మరే పని చేయడం లేదు. దీన్నే పనిగా పెట్టుకున్నా. ఇది రకంగా ఒకరకమైనే సేవే. అమ్మాయిలు తమ ప్రియుడి పట్ల ఎంత ప్రేమగా, నిజాయతీగా ఉంటున్నారని తెలుసుకుని.. ఆ రిపోర్ట్ బాయ్‌ఫ్రెండ్‌కు ఇస్తున్నా. ఆమె నిజాయతిగా ఉంటే.. వారి ప్రేమ మరింత బలపడుతుంది. అలాగే.. ప్రియుడు కూడా ఆమెపై నమ్మకం ఉంచుతాడు. కానీ, కొందరు తమ తల్లి, చెల్లిని కూడా పరీక్షించాలని అడుగుతున్నారు. అలా చేయడం నాకు నచ్చదు’’ అని జావియర్ తెలిపాడు. 


Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!


Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి