క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచంలో ఎక్కువ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ కాన్సర్ వంటి వాటి బారిన పడుతున్నారు. అలాగే ఎంతోమంది అండాశయ క్యాన్సర్ బారిన కూడా పడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఒక పరిశోధన ప్రకారం కొన్ని ఉద్యోగాలు చేసే మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన అధికంగా పడుతున్నట్టు గుర్తించారు. ఆక్యుపేషనల్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం... హెయిర్ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లు, అకౌంటట్లుగా పనిచేసే మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశం అధికంగా ఉంది. అలాగే దుస్తులు తయారీ పరిశ్రమలలో తయారు చేసేవారు కూడా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువే.


వీరంతా టాల్కమ్ పౌడర్, అమోనియా, పెట్రోల్, బ్లీచ్ వంటి ఏజెంట్లతో అధికంగా పనిచేయాల్సిన ఇస్తుంది. అందుకే వీరు ఈ క్యాన్సర్ బారిన అధికంగా పడే అవకాశం ఉన్నట్టు పరిశోధన చెబుతుంది. వీటితో పాటూ పర్యావరణ కారకాలు అధికంగానే ఉన్నాయి.  ఈ అధ్యయనంలో భాగంగా 18 నుంచి 79 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారిని ఎంపిక చేసుకున్నారు. వారిని 2010 నుంచి 2016 వరకు గమనించారు. వీరంతా మహిళలే. వీరందరి వైద్య చరిత్ర, వాడుతున్న మందులు, పునరుత్పత్తి చరిత్ర, బరువు, ఎత్తు, జీవనశైలి వంటివన్నీ సేకరించారు.


మహిళలు చేస్తున్న ఉద్యోగాలు షిఫ్టులు, పనిగంటలు, ప్రధానంగా చేస్తున్న పనులను కూడా తెలుసుకున్నారు. ఉద్యోగ సంబంధిత కారణాల వల్ల కూడా అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు గుర్తించారు. ప్రత్యేకించి హెయిర్ సెలూన్లు, బ్యూటీషియన్ వంటి ఉద్యోగాల్లో పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసే వారిలో అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం మూడు రెట్లు అధికంగా ఉన్నట్టు కనిపెట్టారు. ఇక అకౌంటెంట్లుగా పనిచేసే వారిలో రెండు రెట్లు అధికంగా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అలాగే ఎంబ్రాయిడరీ వంటి బట్టల పరిశ్రమంలో పనిచేసే వారు, సేల్స్ వంటి రంగంలో ఉన్నవారు కూడా దీని బారిన పడే అవకాశం 85% ఉందనే చెబుతున్నారు.


పైన చెప్పిన ఉద్యోగాన్నిట్లోని టాల్కమ్ పౌడర్, అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, దుమ్ము, సింథటిక్ ఫైబర్స్, పాలిస్టర్ ఫైబర్స్, సేంద్రియ రంగులు, పిగ్మెంట్లు, ప్రొపెల్లెంట్ వాయువులు, పెట్రోలు, బ్లీచ్ వంటి రసాయనాలను అధికంగా వాడతారు. వీటికి పదేళ్లపాటు గురైన మహిళల్లో ఆరోగ్య సమస్యలు సులువుగా వస్తాయి.  కాబట్టి వీరంతా జాగ్రత్తగా ఉండాలి. 


Also read: రెండు వారాల్లో మీ చర్మం మెరిసిపోవాలా? ఈ జ్యూస్ తాగండి


Also read: ఇకపై రోగనిర్ధారణ పరీక్షల్లో లాలీపాప్స్ సహాయం, చెబుతున్న కొత్త అధ్యయనం









Also read: డయాబెటిస్ ఉన్నవారికి ఔషధం పనస పిండి - బియ్యం, గోధుమలకు బదులు దీన్ని వాడండి



























































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.