Lollipops: పిల్లలకు ఎంతో ఇష్టమైన పదార్థం లాలీపాప్. ఈ స్వీట్ ట్రీట్ అంటే వారికి అంతులేని ఆనందం. అయితే లాలీపాప్‌ను శాంపిల్ సేకరణలో, రోగనిర్ధారణ ప్రక్రియలలో భాగం చేయవచ్చని చెబుతోంది ఒక అధ్యయనం. లాలీపాప్ లాలాజలంలోని బ్యాక్టీరియాను సంగ్రహించగలదని, దాని సాయంతో లాలాజల శాంపిల్‌ను సేకరించి పరీక్షలు చేయవచ్చని చెబుతున్నారు. స్ట్రెప్ థ్రోట్ బంటి అనేక అనారోగ్యాల నిర్ధారణ కోసం నమూనాలను సేకరించవలసి వస్తుంది. ఆ నమూనాలను నోట్లోంచి సేకరించాలి. వాటిని లాలిపాప్ సాయంతో సేకరించవచ్చు. కోవిడ్ 19 సమయంలో సలైవాను సేకరించి పరీక్షలు చేశారు. అలా సలైవా సేకరించేందుకు లాలీపాప్ సాయం తీసుకోవచ్చని చెబుతోంది అధ్యయనం.
అవసరమైన మొత్తంలో లాలాజలాన్ని సేకరించడానికి లాలీపాప్స్ ఉపయోగపడతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గతంలో లాలీపాప్ ఆకారంలో ఉండే పరికరాలు ఉండేవి. వాటిని క్యాండీ కలెక్టివ్ అని పిలిచేవారు. వాటితో లాలాజలాన్ని సేకరించేవారు. ఇప్పుడు ఆ క్యాండీ కలెక్టివ్ పద్ధతి కనుమరుగైపోయింది. లాలీపాప్ తినేటప్పుడు లాలాజలం సులభంగా దానికి అధిక స్థాయిలో అంటుతుంది. అలాగే నోట్లో ఉన్న బ్యాక్టీరియాలు కూడా అంటుతాయి. ఆ లాలీపాప్‌ను ల్యాబ్లో పరీక్షిస్తే ఆ బాక్టీరియా వల్ల కలిగిన అనారోగ్యాలను కనిపెట్టవచ్చు.
ఇరవై మంది పెద్దవారిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారికి క్యాండీ కలెక్టివ్ పద్ధతితో పాటు, సాధారణ పద్ధతుల్లో కూడా నమూనా కిట్లను ఇచ్చి వాడమని చెప్పారు. తర్వాత ఆ కిట్లను ల్యాబ్ కు పంపించి పరిశీలించారు. సాంప్రదాయక పద్ధతుల్లో ఇచ్చిన కిట్లు కేవలం ఒకటి లేదా రెండు బ్యాక్టీరియాలను మాత్రమే గుర్తించాయి. కానీ క్యాండీ కలెక్ట్ పద్ధతిలో అంటే లాలీపాప్స్ తినే పద్ధతిలో అయితే వందశాతం బ్యాక్టీరియాను గుర్తించింది. కాబట్టి ఇకపై లాలీపాప్ కూడా రోగనిర్ధారణ పరీక్షల్లో భాగం అయ్యే అవకాశం ఉంది.
లాలీపాప్స్‌ను తొలిసారి 1908లో తయారు చేశారు. మిఠాయిల తయారీదారు అయిన జార్జ్ స్మిత్ మొదటిసారిగా లాలిపాప్ ను తయారుచేశారు. దీనికి అతనే ఈ లాలీ పాప్ అనే పేరు పెట్టాడు. అతనికి ఇష్టమైన రేసు గుర్రం పేరు అదే. అందుకే ఆ గుర్రం పేరునే ఈ మిఠాయికి పెట్టాడు. వేల ఏళ్ల క్రితం చిన్న పుల్లకు తేనెను రాసి తినేవారు. అదే మొదటి లాలీపాప్ అని కూడా చెప్పుకుంటారు. తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి తేనెను లాలీపాప్‌లా తయారు చేసి పిల్లలకు తినిపించే వారు.
Also read: ఈ జబ్బు వచ్చిందంటే శరీరమంతా వణికిపోవడమే