బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. అయన ప్రస్తుతం ‘OMG 2’లో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.  గత కొంత కాలంగా అక్షయ్ కుమార్ నటిస్తోన్న సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు.

  


ఆ వార్తలన్నీ అవాస్తవాలేనా?


త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ‘OMG 2’ సినిమాపై పలు ఊహాగానాలు వినిపించాయి. ‘ఆదిపురుష్’ వివాదం నేపథ్యంలో, మతపరమైన అంశాలతో కూడిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని అధికారులు భావిస్తున్నారు. ఈ సినిమా కంటెంట్‌ను నిశితంగా పరిశీలించాలని నిర్ణయించారు. స్క్రూటినీ ప్రక్రియలో ఎటువంటి అభ్యంతరకరమైన సంభాషణలు, విజువల్స్ లేకుండా చూసుకోవడానికి నిపుణుల బృందం చర్యలు తీసుకుంటోంది. అయితే, ‘OMG 2’లో పంకజ్ త్రిపాఠి ఒక స్వలింగ సంపర్క విద్యార్థి ఆత్మహత్య తర్వాత సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించే కళాశాల లెక్చరర్‌గా నటించారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని తాజాగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో స్వలింగ సంపర్కుల అంశం లేదని చిత్రబృందం కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. 


‘OMG’ సీక్వెల్ గా ‘OMG 2’


అక్షయ్ కుమార్ 2012లో నటించిన ‘OMG’ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇది ఒక సెటైరికల్ కామెడీ డ్రామా మూవీ. ఇందులో అక్షయ్ కృష్ణ వాసుదేవ్ యాదవ్ పాత్రను పోషించాడు. ఈ మూవీలో ఆయన కృష్ణుడిలా కనిపించి మెప్పించారు. ఈ సినిమా వచ్చి దాదాపు పదేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ‘OMG2’తో ఆ సినిమాకు సీక్వెల్ ను తీసుకురానున్నారు మేకర్స్. అమిత్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అక్షయ్ శివుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇందులో అక్షయ్ శివుడి పాత్రలో కనిపిస్తోన్న సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ మూవీ పై భారీ అంచానలే ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ షూటింగు పార్టును పూర్తిచేసుకుని, మిగతా పనుల్లో బిజీ అయింది. అక్షయ్ కుమార్, అశ్విన్ వర్దే కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 






ఆగష్టు 11 న విడుదల


అక్షయ్ కుమార్ నటించిన ఈ ‘OMG2’ ఆగస్టు 11న విడదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాతో పాటు సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ అలాగే రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలు కూడా  అదే తేదీన విడుదల కానున్నాయి.  


Read Also: కన్నీళ్లు ఆగలేదు - విజయ్‌తో కలిసి ‘బేబీ’ మూవీ చూశాక రష్మిక స్పందన ఇదీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial