Baby Heroine Vaishnavi Chaitanya: యువ నిర్మాత ఎస్‌కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్ కాంబినేషన్‌లో రూపొందిన 'బేబీ' మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ మంచి కలెక్షన్లు కొల్లగొడుతూ.. తొలి రోజు రికార్డు వసూళ్లు రాబట్టింది. యువ హీరో, హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలో హీరోయిన్ వైష్ణవి చైతన్య చెప్పిన కొన్ని మాటలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. తనను ఓ స్టార్ హీరోయిన్ కు మరో రూపంగా పిలుస్తుండడం ఆనందంగా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


'బేబీ' సినిమా చూసిన తర్వాత స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ప్రతిరూపంగా ఓ హీరోయిన్ దొరికిందని చాలా మంది నోట వినబడుతున్న మాట అని రిపోర్టర్ చెప్పిన మాటకు స్పందిస్తూ.. మీరన్న మాటకు చాలా లక్కీ అన్నట్టుగా ఫీలవుతున్నట్టు వైష్ణవి చైతన్య చెప్పారు. "ఆమె చాలా బ్రిలియంట్ యాక్ట్రెస్, డ్యాన్సర్ కూడా. మీరిచ్చిన కాంప్లిమెంట్ నాకు చాలా పెద్దది. అది అందరి నుంచి వస్తుంది అంటే.. నేను మంచిగా చేశాను, సక్సెస్ అయ్యానేమో అనిపించింది. అందుకు నేను నిజంగా గర్వపడుతున్నా"నని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.


ఇక 'బేబీ' సినిమాలో తన పాత్ర పోషించడంపై మాట్లాడిన వైష్ణవి.. లైఫ్ లో తాను కూడా కొంత పెయిన్ అనుభవించానని చెప్పుకొచ్చింది. "నా పక్కన ఉండే వారి లైఫ్ లో కూడా చూశాను.. ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది. ఇది పక్కన పెడితే.. ఈ సినిమాలో డైలాగ్స్ కానీ, సన్నివేశాలు గానీ.. అన్నీ నా బ్రెయిన్ లోకి ఎక్కిపోయాయి. మధ్య మధ్యలో డైరెక్టర్ ఇచ్చే ఫీడ్ కూడా తనకు బాగా హెల్ప్ అయింది. అది నా మైండ్ లో బాగా స్థిరపడిపోయింది. ఒక్కోసారి ఆ జోన్ నుంచి బయటపడడానికి కూడా టైం పడ్తుండే’’ అని ఆమె చెప్పారు. 


ఇలాంటి సిచ్యువేషనే రియల్ లైఫ్ లో ఎదురైతే..


"సినిమాలో చూపించినట్టు ఆ అమ్మాయి ఓ బస్తీ నుంచి బయటకొచ్చి ఎక్స్ ప్లోర్ అవుతూ ఉంటుంది. నేను కూడా అదే సేమ్ పాత బస్తీ నుంచి వచ్చాను. నేను చాంద్రాయణ గుట్ట నుంచి బైక్ పై వచ్చేటపుడు ప్రపంచమంతా నాకు కొత్తగా కనిపించేది. ఇనార్బిట్ మాల్ చూసినపుడు కూడా ఇదేంటీ ఇంత పెద్దగా ఉంది అనుకున్నాను. ఇదంతా ఏంటీ ఇంత కొత్తగా ఉంది అనిపించింది" అని వైష్ణవి చెప్పుకొచ్చారు.


చిన్నప్పట్నుంచి తనకు తన ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారని వైష్ణవి చైతన్య చెప్పింది. "కాబట్టి సినిమాలో చేస్తున్నపుడు కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలని అనుకోలేదు. ఈ సినిమా మా పేరెంట్స్ చూసినపుడు.. నా తల్లిదండ్రులుగా కాకుండా ఆడియెన్స్ గా మాత్రమే చూశారు. అందుకే వాళ్లకు తమ కూతురు ఇక్కడుంది, ఇలా చేసింది అని వాళ్లేం పట్టించుకోలేదు. కానీ నేను ఈ సినిమాకు ఎంత వరకు న్యాయం చేశాననే దాన్నే చూశారు" అని వైష్ణవి తన అభిప్రాయాలను చెప్పారు.


Read Also : AAA Cinemas: ఆంధ్రప్రదేశ్‌లోనూ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial