టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఓ వైపు సినిమాల్లో దూసుకుపోతూనే మరోవైపు బిజినెస్ లలో కూడా రానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో వస్తోన్న ‘పుష్ప 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఇటీవలే ఆయన మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏషియన్ సినిమాస్ తో కలసి ఏఏఏ సినిమాస్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో తన సొంత మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా ఓపెన్ చేశారు. ఈ మల్టీప్లెక్స్ లో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ప్రేక్షకుడికి ఓ మంచి థియేట్రకిల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. ఇది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. తాజాగా ఏఏఏ సినిమాస్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఏపీలోనూ ఏఏఏ సినిమాస్?


సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ  మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్, వెంకటేష్, బాలకృష్ణ లు కూడా థియేటర్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు అదే కోవలోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వచ్చి చేరాడు. అయితే ఈ బిజినెస్ లలో చాలా వరకూ హైదరాబాద్ బేస్ గానే రన్ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ ఓపెన్ చేయడం అది సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఏపీపై దృష్టి పెట్టారని టాక్ నడుస్తోంది. తన మల్టీప్లెక్స్ బిజినెస్ ను ఏపీలో కూడా ప్రారంభిచాలని చూస్తున్నారట. ఇప్పుడిదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ మూవీ లవర్స్ మాత్రం ఏఏఏ సినిమాస్ ను ఏపీలోనూ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారట. మరి దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తారో లేదో చూడాలి. 


ఏఏఏ ప్రత్యేకతలు ఇవే..


హైదరాబాద్ లో నిర్మించిన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ అత్యాధునిక హంగులు కలిగి ఉంది. ఇందులో మొత్తం 5 స్క్రీన్ లు ఉన్నాయి. మొదటి స్క్రీన్ లో 67 అడుగుల ఎత్తు ఉంటుంది. డాల్బీ అట్మోస్‍ సౌండ్‍తో బార్కో లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇక సెకండ్ లో ఈపీఐక్యూ లక్సన్ స్క్రీన్‍గా ఉంది. డాల్బీ అట్మోస్ సౌండ్ ఉంటుంది. మిగిలిన మూడు స్క్రీన్లు 4కే ప్రొజెక్షన్‍ తో నడుస్తాయి. ఈ ఐదు థియేటర్లలో డాల్బీ 7.1 సౌండ్ ఉంటుంది. ప్రేక్షకులు కూర్చొనే సీటింగ్ కూడా న్యూలుక్ తో కంఫర్ట్ గా డిజైన్ చేశారట. మొత్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ మల్టిప్లెక్స్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. మరి ఏపీలోనూ ఇదే తరహా మల్టీప్లెక్స్ ను నిర్మిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఇలాంటి సౌకర్యాలతోనే మల్టీప్లెక్స్ ను నిర్మిస్తే ఏపీలో ఉన్న సినిమా లవర్స్ కు మంచి థియేట్రికల్ అనుభూతి కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. 


Also Read: ఆ హీరో బ్రెయిన్ సర్జరీకి బిల్ కట్టి, ప్రాణాలు కాపాడిన సల్మాన్ ఖాన్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial